30.10.2025 వర్షాలప్రభావాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 31/10/2025
పత్రికా ప్రకటన
వర్షాల ప్రభావాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
రేగిడి ఆమదాలవలస, (విజయనగరం) అక్టోబర్ 30 : మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఆయన గురువారం రాజాం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జరిపారు. రహదారులను, పంట పొలాలను, నీటి ప్రవాహాలను పరిశీలించారు. రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి నదిని పరిశీలించారు. నది ప్రవాహం, దిగువనున్న ప్రాంతాలు, పంట పొలాల పరిస్థితిని తెలుసుకున్నారు. నష్ట నివారణా చర్యలు తీసుకోవాలని, పరివాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించాలని కలెక్టర్ ఆదేశించారు. రాజాం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో ఆర్డీవో జీవి సత్యవాణి, తహసీల్దార్ కృష్ణ లత , ఇతర రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
………..
జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

30-10-A

30-10-B