Close

30.10.2025 భూసేకరణకుసంబంధించిన పనులన్నీ వేగవంతం కావాలి, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

Publish Date : 31/10/2025

పత్రికా ప్రకటన-4

  భూసేకరణకు సంబంధించిన పనులన్నీ వేగవంతం కావాలి

 జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

విజయనగరం, అక్టోబరు 30:  జిల్లాలో పలు ప్రోజెక్టుల కోసం చేపడుతున్న భూసేకరణ కు సంబంధించిన అవార్డ్ పాస్ చేయడం, సంబంధిత  అధికారులకు లేఖలు రాయడం, ఇతర ప్రాసెస్సింగ్ వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం ముగ్గురు ఆర్.డి.ఓ లతో కలెక్టర్ తన ఛాంబర్లో భూసేకరణ పై సమీక్షించారు.  జాతీయ రహదారుల, భోగాపురం ఎయిర్పోర్ట్, ట్రైబల్ యూనివర్సిటీ, రెల్లి వద్ద గ్రేహౌండ్స్ కి కేటాయించిన భూమి, ఎం.ఎస్.ఎం.ఈ ల కోసం భూసేకరణ, మురునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ కు, రైతు బజార్, విజయనగరం డిగ్రీ కళాశాలకు వేణుగోపాపురం వద్ద కేటాయించిన భూమి, నియోజకవర్గ పరిధిలో ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు తదితర ప్రోజెక్టుల కు భూసేకరణ సమస్యల పై ఆర్.డి.ఓ ల తో చర్చించినారు. టైం లైన్ లోపల పనులు పూర్తి కావాలని, పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించుకోవాలని అదేశించారు.

ఈ సమావేశంలో జె.సి సేదు మాధవన్, ఆర్.డి.ఓ లు కీర్తి, రామ్మోహన్, సత్యవాణి , సూపరింటెండెంట్ లు గోవింద,  సూర్యలక్ష్మి పాల్గొన్నారు.

========

 జారీ : డిఐపిఆర్ఒ,  విజయనగరం

30-10-A

30-10-A

30-10-B

30-10-B