322 applications for response should be resolved by the deadline Appointment of five secretariat employees District Collector Mrs. A. Suryakumari
Publish Date : 02/11/2021
స్పందనకు 322 దరఖాస్తులు
వినతును గడువు లోగానే పరిష్కరించాలి
ఐదుగురు సచివాలయ ఉద్యోగుల నియామకం
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి
విజయనగాం, నవంబర్ 01: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమ వారం నిర్వహించే స్పందన కు 322 వినతులు అందాయి. ఈ వినతులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, హౌసింగ్ జే.సి మయూర్ అశోక్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, డి.పి.ఎం. పద్మావతి స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు అందజేసారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన వినతులను గడువు కంటే ముందుగానే పరిష్కారం జరగాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం రెవిన్యూ కు సంబంధించి 225 దరఖాస్తులు, డి.ఆర్.డి.ఎ కు 51 , జిల్లా వైద్య ఆరోగ్య శాఖా దికరికి చెందినవి 10 , డి.సి.హెచ్.ఎస్ కు 26 , దరఖాస్తులు అందగా పౌర సరఫరాలకు సంబంధించి 10 దరఖస్తులు అందాయి.
సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాల అందజేత :
సచివాలయాల కు స్పోర్ట్స్ కోటా లో నియామకం అయిన ఐదుగురు డిజిటల్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ అందజేశారు. స్పోర్ట్స్ కోటా లో 10 పోస్టులు ఖాళీలు ఉండగా సోమవారం ఐదుగురుని నియమించారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. మేష్ కుమార్, జిల్లా పంచాయతి అధికారి, సుభాషిని పాల్గొన్నారు.
స్పందన భొజనానికి వితరణ:
ప్రతి సోమవారం స్పందన వినతులను అందజేయటానికి కలక్టరేట్ కు వచ్చే అర్జీదారులకు స్పందన భోజనం అందించడానికి ఆంధ్ర ప్రదేశ్ బాలయోగి గురు కులాల విద్యాలయాల సమన్వయ కర్త చంద్రావతి 10 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ సూర్య కుమారికి స్పందన లో అందజేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ చంద్రావతిని అభినందించారు.
