Grain purchasing centers should be set up and the target of 6 lakh metric tonnes should be worked out this year, said District Collector A. Surya Kumari.
Publish Date : 30/10/2021
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంచేయాలి
ఈ ఏడాది 6 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం పని చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, అక్టోబర్29: జిల్లాలో ధాన్యం సేకరణకు అన్ని రకాల ఏర్పాట్లను గావించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులను ఆదేశించారు. 624 రైతు భరోసా కేంద్రాల్లోనూ , 119 పాక్స్, 63 వెలుగు కేంద్రాలు, 8 జిసిసి, 5 రైతు సంఘాల ద్వారానే కాకుండా 2 డిసిఎంఎస్, 19 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ల ద్వారా మొత్తం 216 ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లను గావించాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. సోమవారం నాటికి అన్నిచోట్ల బ్యానర్లను పెట్టి ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు . ప్రతి కేంద్రం వద్ద తేమ యంత్రాలను సిద్ధం చేయాలన్నారు. తేమ యంత్రాలను పని చేస్తున్నది లేనిది ఒక సారి పరీక్షించుకొని, పని చేయక పోతే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. గన్నీ లు, వాహనాలు సిద్ధం చేయాలనీ, రిజిస్టర్ లు, రసీదులను కూడా తయారు చేసుకొని ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పాక్స్ నుండి సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. డ్వాక్రా సభ్యలకు, గిరి మత్ర లకు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి వారిని సమాయత్తం చేయాలన్నారు. అందరి మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని, ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేల ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు.
నవంబర్ కల్లా 20,327 మెట్రిక్ టన్నుల పంట వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు గావించాలన్నారు. డిసెంబర్ కు 1.56 లక్షల మెట్రిక్ టన్నులు , జనవరి నాటికి 3.33 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట రావచ్చని , వచ్చిన పంటను ఎప్పటికప్పుడు సేకరించి మిల్లర్లకు ఇవ్వాలని, పెండింగ్ ఉండే సహించేది లేదని స్పష్టం చేసారు.
సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ ఈ పంట నమోదు 98 శాతం పూర్తి అయ్యిందని, ఆయితే ఈ.కే.వై.సి 71 శాతం మాత్రమే అయ్యిందని, తక్కువగా ఉన్న మండలాల్లో దీని పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏ పంటలు వేస్తున్నారు, ఎంత విస్తీర్ణం లో వేస్తున్నారు అనే సమాచారం ప్రతి మండల వ్యవసాయ అధికారి వద్ద ఉండాలని, రైతులు వేసే పంటల వివరాలను ముందుగానే వ్యవసాయ అధికారులకు తెలియాలని అన్నారు. క్షేత్ర స్థాయి లో దృష్టి పెడితే నే ఈ వివరాలు తెలుస్తాయని అన్నారు.
ఈ సమావేశం లో వ్యవసాయ శాఖ జే.డి రామ రావు, డి డి లు నందు, ఆనంద్, ఎ.డి. లు, జిల్లా సహకార అధికారి అప్పల నాయుడు , ఉద్యాన శాఖ డి.డి. శ్రిని వస రావు, పౌర సరఫరాల, మార్క్ఫెడ్, మార్కెటింగ్ , డి.ఆర్.డి.ఎ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.