District Collector A. Suryakumari conducted a surprise inspection of the Secretariat
Publish Date : 18/11/2021
సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
సంపూర్ణ గృహహక్కు పథకంపై అవగాహన కల్పించాలి
ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
రామభద్రాపురం మండలం, నవంబర్ 17:- జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓ.టి. ఎస్) పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, అర్హత ఉన్న లబ్ధిదారులు వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా రామభద్రాపురం మండలం ఆరికతోట గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాజరు పట్టినీ, మూవ్మెంట్ రిజిష్టర్‌ను పరిశీలించారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం ద్వారా, వాటిని అర్హులందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు. వేక్సినేషన్, పంటల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలను అందించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ఆరికతోట రెవెన్యూ పరిధిలో 364సర్వే నంబర్ లో 16 హెక్టార్లలో మెయిన్స్ ఏర్పాటుకు శుబ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మండలంలో ఎం.టి.పి త్రవ్వకాల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నందున ఎ.పి కాలుష్య నియంత్రణా మండలి ఈ ఈ సుదర్శన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దత్తిరాజెరు మండలం ఎస్. బూర్జ వలస గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరైయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆరికతోట రెవెన్యూ పరిధిలో ప్రజలు వారికి సమ్మతమే నని అంగీకారం తెలిపారు, దత్తిరాజెరు మండలం బూర్జివలస, కృష్ణాపురం, కె.కొత్త వలస తదితర గ్రామాల రైతులు, ప్రజలు మా గ్రామాలలో కాలుష్యం ఏర్పడుతుందని, పంటలు పాడవుతాయి, మేము అనారోగ్య పాలవుతమని వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు, రైతుల నుండి వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా అభిప్రాయాలు సేకరించి తదుపరి చర్యలు నిమిత్తం ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరుగుతుంది అన్నారు.
ఈ పర్యటనలో రామభద్రాపురం మండలం రెవెన్యూ అధికారులు, సచివాలయ అధికారులు సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.