* Collector praises District Authority * Officers and staff who played a key role in the vaccination process
Publish Date : 13/12/2021
*జిల్లా అధికార బృందానికి కలెక్టర్ ప్రశంసలు*
* వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బంది
విజయనగరం, డిసెంబర్ 11 ః జిల్లాలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశాజనకంగా సాగినందుకు కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికార బృందానికి అభినందనలు తెలిపారు. మంచి పనితీరు కనబరిచారని తక్కువ కాలంలోనే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నారని కొనియాడారు. వైద్య సిబ్బంది, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు ఎంతో శ్రమించి జిల్లాలో 96.7 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 18.90 మందిని గుర్తించగా అందులో 18.29 లక్షల మందికి పరిమితి కాలంలోనే వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేశారని వివరించారు. మరింత బాగా పని చేయాలని శతశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె సూచించారు.