Collector Congratulations to the Doctors
Publish Date : 20/12/2021
వైద్యులకు కలెక్టర్ అభినందన
వాక్సినేషన్ మొదటి డోస్ శతశాతం చేరుకోవడం వల్ల రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. లక్ష్య సాధనలో విజయం సాధించినందుకు కలెక్టర్ వైద్యులను అభినందించారు. శనివారం రాత్రి డిఎంహెచ్ఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరు కలసికట్టుగా పని చేయడం వల్ల ఆశించిన ఫలితాన్ని సాధించగలిగామని అన్నారు. ఈ విధంగా వైద్యలను ముందుకు నడిపించిన ఘనత జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ చొరవేనని కొనియాడారు. కాగా, రెండో డోస్ కూడా శతశాతం లక్ష్యాలను చేరుకోవడానికి మీ అందరు కృషి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ ధర్డ్ వేవ్ ను కూడా సమర్ధవంతంగా వివిధ రకాల ప్రదర్శనలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఒ డాక్టర్ ఎస్ వి రమణకుమారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.