Increase sand reserves Stock point should be set up at Chipurupalli Joint Collector Dr. GC Kishore Kumar
Publish Date : 03/01/2022
ఇసుక నిల్వలు పెంచాలి
చీపురుపల్లిలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి
జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్
విజయనగరం, జనవరి 02 ః
జిల్లా అవసరాలకు సరిపడే విధంగా స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలను పెంచాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక సరఫరా పరిస్థితిపై, భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు జె.రవివర్మతో తన ఛాంబర్లో ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ, ప్రస్తుతం భవన నిర్మాణ పనులకు అనుకూలమైన సమయమని, ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం ఇసుక సరఫరా, నిల్వలపై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే, స్టాకును మరింత పెంచాలని సూచించారు. ప్రభుత్వ నిర్మాణాలతోపాటు, సామాన్య ప్రజలకు కూడా ఇసుకను తగినంతగా అందుబాటులో ఉంచాలన్నారు. దీనికోసం శ్రీకాకుళంలో మరికొన్ని ఇసుక రీచ్‌లను గుర్తించి, ప్రతిపాదన సిద్దం చేయాలన్నారు. చీపురుపల్లిలో ఇసుక స్టాక్‌పాయింట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. జిల్లాలో అదనంగా రీచ్‌లను గుర్తించి ప్రజలకు అందుబాటులో తేవాలని జెసి కిశోర్ కోరారు.