District Collector Mrs. A. Suryakumari directed the CDPOs to take steps to provide good nutrition to underweight children below the age of 6 years in all Anganwadi Centers.
Publish Date : 02/02/2022
బరువు తక్కువ ఉన్న చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడంపై తల్లులకు అవగాహన
అంగన్వాడీ సెంటర్లలో ప్రోగ్రస్ లేకపోతే తగు చర్యలు
చిన్నారులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వాహించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి
విజయనగరం ఫిబ్రవరి, 01: అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 6 సంవత్సరాలలోపు ఉన్న తక్కువ బరువు వున్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి సిడిపిఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలకు నీతి అయోగ్ ఇండికేటర్సు (అక్టోబరు నుండి డిసెంబరు వరకు) ఆరోగ్యం మరియు పౌష్టికాహారం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులను ఎప్పటికప్పుడు బరువు, ఎత్తును పరిశీలించాలని, తక్కువ బరువు వున్న చిన్నారులను గుర్తించి ఎన్.ఆర్.సి. (న్యూట్రిషన్ రిసోర్సు సెంటర్స్) కేంద్రాలలో 15 రోజులు పాటు వుంచి మంచి పౌష్టిహాకారం అందించి వారి బరువు పెరిగే విధంగా చూడాలని దానికి వారి తల్లులు ఆయా కేంద్రాలకు వెళ్లే విధంగా అవగాహన కలిగించాలన్నారు. అదేవిధంగా స్కూలుకు వెళ్లే చిన్నారులకు హెచ్.బి. టెస్టు చేయించి రక్త హీనత వున్న చిన్నారులకు ఐరన్ సప్లమెంట్లను ఇవ్వాల్సివుంటుందన్నారు. ఎ.ఎన్.ఎం.లతో ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలన్నారు. స్కూలుకు వెళ్లని పిల్లలను (డ్రాఫౌట్స్) గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఇంటింటి సందర్శనకు వెళ్లినప్పుడు తల్లిబిడ్డల ఆరోగ్యాలపై ఆరా తీసి వారు పౌష్టికాహారం, మందులు తీసుకొనే విధంగా అవగాహన కలిగించాలన్నారు. తల్లిబిడ్డలందరిని ఒక దగ్గర ఉమ్మడిగా కూర్చొని బాలామృతం, పాలు, గుడ్డు తదితర పౌష్టికాహారాన్ని వారి పిల్లలకు పెట్టేవిదంగా చూడాలన్నారు. సాలూరు, భద్రగిరి, కురుపాం పి.హెచ్.సి. పరిధిలో తక్కువ బరువు వున్న చిన్నారుల శాతం ఎక్కువగా వుందని, తరువాత నిర్వహించే సమావేశం సమయానికి ఆ శాతాన్ని తగ్గించే విధంగా చూడాలని సిడిపిఓలను ఆదేశించారు. గర్భస్రావాలు జరుగకుండా చూడాలన్నారు. అనుమతి లేకుండా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్న సెంటర్లపై గట్టి నిఘాను పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, సిపిఓ విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణకుమారి, ఐసిడిఎస్ పి.డి రాజేశ్వరి, సిడిపిఓలు తదితరులు హాజరయ్యారు.