Close

Tidco houses should be owned by the beneficiaries expeditiously, infrastructure in Jagannath colonies should be expedited, District Collector A. Suryakumari

Publish Date : 03/02/2022

టిడ్కో గృహాలను లబ్దిదారులకు త్వరగా స్వంతం చేయాలి

జగనన్న కాలనీలలో మౌలిక వసతులు వేగంగా జరగాలి

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, ఫిబ్రవరి 02: జగనన్న కాలనీలు, టిడ్కో గృహాలు, ఓ.టి.ఎస్. పధకం లబ్దిదారుల ప్రయోజనం కోసమేనని, ఈ విషయాన్నీ వారికి అర్థం అయ్యేలా చేసి చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. స్వంత డబ్బులు గాని, ఋణం కల్పించి గానీ ఏ విధంగా నైనా చెల్లింపులు చేయించి గృహాలను లబ్దిదారు స్వంతం చేయాలనీ ఆదేశించారు. బుధవారం ఆమె ఛాంబర్ లో గృహ నిర్మాణాల పై జే.సి. అశోక్ మయూర్ తో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడ్కో గృహాల కు రెండు వాయిదాలలో చెల్లించిన వారికి గృహాన్ని అప్పగించాలని, లేదా రద్దు చేసి అర్హత ఉన్న వేరే వారికీ ఇవ్వాలని సూచించారు. అర్హులైన వారికి అందరి బ్రాంచ్ మేనేజర్లకు మాట్లాడి బ్యాంకు రుణాలు కల్పించాలని లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రావుకు సూచించారు. ఆ మేరకు రుణ మంజూరు లేఖలను వెంటనే అందేలా చూడాలన్నారు.

జగనన్న కాలనీలలో జల జీవన్ మిషన్ పధకం ద్వారా బోర్ వెల్స్ వేసేలా ప్రతిపాదనలు పంపాలని ఆర్.డబ్లు.ఎస్. ఎస్.ఈ శివానంద్ కుమార్ కు ఆదేశించారు. విద్యుత్ సరఫరా, అప్రోచ్ రోడ్స్ , లే అవుట్లలో ఇంటర్నల్ రహదారులు వెంటనే పూర్తి చేయా లన్నారు. మేషన్ పని వారిని లబ్దిదారులకు వెంటనే మాపింగ్ చేయాలనీ ,నిర్మాణాలకు అవసరమగు సామగ్రినంతా సిద్ధంగా ఉంచాలని అన్నారు. డూప్లికేట్, వలస వెళ్ళిన, ఆసక్తి కనపరచని లబ్దిదారులను తొలగించి 90 రోజుల స్కీం లో అర్హులైన వారికీ మంజూరు చేయాలని సూచించారు.. వారం రోజుల్లో పురోగతి కనపడాలని, అధికారులంతా క్షేత్ర స్థాయి లో సమీక్షించుకొని వేగంగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

ఈ సమావేశం లో డి.ఆర్.డి.ఏ , హౌసింగ్ మెప్మ పి.డిలు డా. అశోక్ కుమార్, పి.కూర్మి నాయుడు, సుధాకర రావు, మున్సిపల్ కమీషనర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tidco houses should be owned by the beneficiaries expeditiously, infrastructure in Jagannath colonies should be expedited, District Collector A. Suryakumari