Accelerate construction of toilets in Anganwadi Centers and Government Schools, District Collector Mrs. A. Suryakumari
Publish Date : 09/02/2022
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఫిబ్రవరి 05 ః అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను మార్చి నెల లోపల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబరులో ఐసిడిఎస్, డి.ఇ.ఓ., సమగ్ర శిక్ష, ఆర్.డబ్ల్యు.ఎస్., అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఇంకా మొదలు పెట్టని మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలని, పాఠశాలలలో కూడా మరుగుదొడ్లతో పాటు నిరంతర నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ మరియు పాఠశాలల భవన నిర్మాణాలు, మరమ్మత్తులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పాఠశాలలో క్రీడా మైదానాల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. డ్రాపౌట్స్ పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తిరిగి వారు పాఠశాలలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను ఆర్.డబ్ల్యు.ఎస్. ఇంజనీరింగ్ విభాగం చేయాలని, అదేవిధంగా పాఠశాలలలో సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ విభాగం పనులను చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐ.సి.డి.ఎస్. పి.డి. రాజేశ్వరి, ఇన్ ఛార్జి డిఇఓ బ్రహ్మాజీరావు, సమగ్రశిక్ష ప్రోజెక్టు అధికారి స్వామినాయుడు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాజరయ్యారు.