Beneficiaries should come forward for full cooperation for construction of houses. District Collector A. Suryakumari
Publish Date : 09/02/2022
ఇళ్ల నిర్మాణానికి సంపూర్ణ సహకారం
లబ్దదారులు ముందుకు రావాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
గుంకలాం లేఅవుట్ ను పరిశీలించిన కలెక్టర్
ఒంపల్లి సచివాలయం తనిఖీ
విజయనగరం, ఫిబ్రవరి 08 ః
జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వపరంగా సంపూర్ణ సహాకారాన్ని అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. లబ్దిదారులంతా ముందుకు వచ్చి, ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం వద్ద రూపొందించిన భారీ లేఅవుట్ను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఇళ్ల నిర్మాణాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. అవగాహనా సదస్సుకు హాజరైన గృహనిర్మాణ లబ్దిదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే మంజూరైన ఇళ్లను లబ్దిదారులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటినీ ప్రభుత్వపరంగా కల్పించడం జరుగుతోందన్నారు. సిమ్మెంటు, ఇసుక, ఐరన్ ఇస్తున్నామన్నారు. లేఅవుట్లలో నిర్మాణం కోసం నీటి సదుపాయం కూడా కల్పించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగాం చేసుకొని, లబ్దిదారులంతా త్వరగా తమ ఇళ్లను పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సూర్యనారాయణ, హౌసింగ్ పిడి కూర్మినాయుడు, ఇఇ ఎన్వి రమణమూర్తి, డిఇ సిహెచ్ శ్రీనివాసరావు, ఏఇలు పాల్గొన్నారు.
ఒంపల్లి సచివాలయం తనిఖీ
బొండపల్లి మండలం ఒంపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, రికార్డులను పరిశీలించారు. వేక్సినేషన్, ఓటిఎస్, గృహనిర్మాణం, పోషకాహార పంపిణీ, ఇంటింటి చెత్త సేకరణ, ఉపాదిహామీ పనులు తదితర కార్యక్రమాల అమలుపై సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, మహిళలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, బాలికల చదువు, గర్భస్థ లింగ నిర్ధారణ, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై గ్రామ సర్పంచ్ లండ నారాయణమ్మను ఆరా తీశారు. ఓటిఎస్ కార్యక్రమం పేదలకు ప్రభుత్వం కల్పిస్తున్న గొప్ప అవకాశమని, కేవలం రూ.10వేలు చెల్లించి లక్షల విలువైన ఆస్తిపై సంపూర్ణ హక్కును పొందవచ్చని సూచించారు. ఈ పథకాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకొనేలా చూడాలని కోరారు. గ్రామానికి మంజూరైన 45 ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడాలంటే, ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ జరగాలని, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లను వాడేవిధంగా చూడాలన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకొనేలా వారిని చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు.