Joint Collector Kishore Kumar, who delicately refined the problem of the sand Conflicts.
Publish Date : 09/02/2022
*సద్దుమణిగిన ఇసుక గొడవ*
*సమస్యను సున్నితంగా పరిష్కరించిన జేసీ కిశోర్ కుమార్
విజయనగరం, ఫిబ్రవరి 08 ః పూసపాటిరేగ మండలంలోని లంకెలపాలెం, గోవిందపురం గ్రామాల మధ్య ఇసుక తరలింపు విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం సద్దుమణిగింది. ఇరు గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ మంగళవారం అక్కడ పర్యటించారు. స్థానిక గ్రామ పెద్దలను, గ్రామస్థులను కలిసి సమస్యపై చర్చించారు. అందరూ సోదరభావంతో మెలగాలని, గొడవలు సరికాదని నచ్చజెప్పారు. ఇక నుంచి ఇసుక తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంటుందని, స్థానిక రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులను జేసీ ఈ సందర్భంగా ఆదేశించారు.