Close

District Collector inspects village secretariats, suspends two employees who are frequently absent from duty

Publish Date : 25/03/2022

గ్రామ సచివాలయాల్లో జిల్లా కలెక్టర్ తనిఖీలు
విధులకు తరచుగా గైర్హాజరు అవుతున్న ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
మెరక ముడిదాం, తెర్లాం మండలాల్లో పర్యటన
సచివాలయాల పనితీరుపై అసంతృప్తి
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి: తెర్లాంలో రైతులకు సూచన

విజయనగరం, మార్చి 15:
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. సూర్యకుమారి తేర్లాం, మెరక ముడిదాం మండలాల్లో తరచూ విధులకు గైర్హాజర్ అవుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సచివాలయం సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మంగళవారం తెర్లాం మండలం వెలగ వలస, మెరక ముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెర్లాం మండలం వెలగవలస సచివాలయం తనిఖీ సందర్భంగా డిజిటల్ అసిస్టెంట్ గురించి ఆరా తీశారు. డిజిటల్ అసిస్టెంట్ రవికుమార్ కార్యాలయానికి తరచూ గైర్హాజర్ అవుతున్నట్టు మండల స్థాయి అధికారులు, సిబ్బంది ద్వారా తెలుసుకోవడం తో పాటు ఆ ఉద్యోగిపై ఫిర్యాదులు కూడా వస్తున్న నేపథ్యంలో డిజిటల్ అసిస్టెంట్ రవికుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మెరక ముడిదాం మండలం ఉత్తరావిల్లి లో గ్రామ సచివాలయం ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా గ్రామ సచివాలయం సిబ్బంది హాజరును కలెక్టరు పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.వి. గోపాలకృష్ణ విధులకు హాజరు కానట్టు గుర్తించి ఆరా తీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులకు తరచూ గైర్హాజరు అవుతున్నట్టు గుర్తించి ఆయనను సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు.

వెలగ వలస, ఉత్తరావిల్లి గ్రామ సచివాలయాల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు సచివాలయాల్లో సిబ్బంది తమ పనితీరు మెరుగుపరుచు కోవాలని ఆదేశించారు

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: రైతులకు సూచన
తెర్లాం మండలం వెలగవలస లో పంటల సాగు, రైతుల పరిస్థితి పై జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారి రవికుమార్ తో ఆరా తీశారు. సాగు నీటి లభ్యత తక్కువగా వున్న కారణంగా వరి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారని ఏ.ఓ. వివరించారు. దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇక్కడి మట్టి నమూనాలు పరీక్షించి ఈ ప్రాంతం ఏ పంటలకు అనుకూలంగా వుంటుందో గుర్తించి తదనుగుణంగా పంటలకు సిఫారసు చేయాలని ఫోన్ లో ఉద్యాన శాఖ డి.డి. శ్రీనివాస్ ను ఆదేశించారు. ముఖ్యంగా కాయగూరల పంటల సాగుకు రైతుల్ని ప్రోత్సహించాలని, పెట్టుబడి తక్కువగా వుండే ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. తనను కలిసిన రైతులతో కూడా అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులను కలెక్టర్ కోరారు. వెలగవలసలో ఉపాధిహామీ కన్వర్జెన్స్ నిధులతో నిర్మించిన సి.సి రోడ్డును కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో పది సి.సి. రోడ్ల పనులు మంజూరు కాగా ఆరు జరుగుతున్నాయని, మరో నాలుగు పనులు ప్రారంభించ నున్నట్ట ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.

అంగన్ వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన మునకు కోడి గుడ్డు సరఫరాపై, అంగాన్ వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు నమోదుకు సంబంధించి రిజిస్టర్ లను తనిఖీ చేశారు. పాఠశాలల్లో బాలికలకు రక్తహీనత సమస్యలు, హీమోగ్లోబిన్ స్థాయి పై ఏ.ఎన్. ఎం.తో ఆరా తీశారు.

గృహనిర్మాణం, సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు పై తెలుసుకున్నారు.

జారీ సహాయ సంచాలకులు సమాచార పౌరసంబంధాల శాఖ విజయనగరం

District Collector inspects village secretariats, suspends two employees who are frequently absent from duty