Distribution of laptops to diverse talents, recruitment of disabled backlog posts
Publish Date : 29/03/2022
విభిన్న ప్రతిభావంతులకు లాప్టాప్ ల పంపిణీ
వికలాంగుల బాక్లాగ్ పోస్టుల నియామకాలు
విజయనగరం, మార్చి 28:: విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ ద్వారా అంధులకు, బధిరులకు 13 లాప్టాప్ లను జిల్లా కలెక్టరు సూర్య కుమారి అందజేశారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్బహించిన స్పందన కార్యక్రమంలో ఒక్కొక్కటి 35 వేల రూపాయలు విలువ చేసే లాప్టాప్ లను, టచ్ ఫోన్ ను , 6 వేల రూపాయలు విలువైన 3 ట్రై సైకిళ్లను అందజేశారు.
వరల్డ్ విజన్ స్వచ్చంద సంస్థ, సెట్విస్ ఆధ్వర్యంలో 100 మంది విభిన్న ప్రతిభావంతులకు సుమారు 20 లక్షల విలువ చేసే ట్రై సైకిళ్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
వికలాంగుల కోటా లో బాక్లాగ్ ఖాళీలలో 7 గురు విభిన్న ప్రతిభా వంతులకు పబ్లిక్ హెల్త్ వర్కర్స్ గా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో నియమిస్తూ ఉద్యోగ నియామక ఉత్తర్వులను కలెక్టర్ అందజేసారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు మయూర్ అశోక్, వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, సెట్విస్ సి.ఈ.ఓ విజయకుమార్, ఇంచార్జ్ ఏ.డి కీర్తి తదితరులు పాల్గొన్నారు.