Mayur Ashok took over as the District Joint Collector on Monday in the JC (Revenue) Chamber of the Collector’s Office.
Publish Date : 06/04/2022
జె.సి.గా బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్
విజయనగరం, ఏప్రిల్ 04 :జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని జె.సి.(రెవిన్యూ) ఛాంబరులో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు హౌసింగ్ జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించిన మయూర్ అశోక్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్‌ను జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, విజయనగరం ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్, చీపురుపల్లి ఆర్డీఓగా నియమితులైన అప్పారావు, బొబ్బిలి ఆర్డీఓగా నియమితులైన శేషశైలజ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల సిబ్బందిని ఏ.ఓ. శ్రీకాంత్ జాయింట్ కలెక్టర్‌కు పరిచయం చేశారు. జాయింట్ కలెక్టర్‌ను జిల్లాలోని పలువురు రెవిన్యూ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలసి పరిచయం చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు, చీపురుపల్లిలో, బొబ్బిలిలో నూతన ఆర్డీఓ కార్యాలయాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
జె.సి.గురించి….
1993లో జన్మించిన జె.సి. మయూర్ అశోక్ స్వస్థలం మహారాష్ట్రలోని పూనే. ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేశారు. ఎం.ఏ.(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) కూడా చేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి అయిన మయూర్ అశోక్ తొలుత బీహార్ కేడర్‌లో చేశారు. ఆయన సతీమణి మన రాష్ట్ర క్యాడర్లో ఐ.ఏ.ఎస్.గా పనిచేయడంతో మన రాష్ట్ర క్యాడర్‌కు కేటాయిస్తూ తెనాలి సబ్ కలెక్టర్‌గా నియమించారు. అనంతరం 2021 జూన్‌లో జిల్లాకు జాయింట్ కలెక్టర్(హౌసింగ్)గా నియమితులై నాటి నుంచి జిల్లాలో పనిచేస్తున్నారు.
