Requests should be resolved within the deadline, 128 requests for response, work plan details should be sent from all branches, District Collector Suryakumari
Publish Date : 18/04/2022
👉గడువు లోగా వినతుల పరిష్కారం జరగాలి
👉స్పందనకు 128 వినతులు
👉అన్ని శాఖల నుండి వర్క్ ప్లాన్ వివరాలను పంపాలి
👉 జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఏప్రిల్ 18:: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 128 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం వైద్య శాఖకు 18, డి.ఆర్.డి.ఏ కు 11 వినతులు అందగా రెవిన్యూ కు సంబంధించి 99 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు ఉప కలెక్టర్ పద్మావతి స్వీకరించారు.
అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత గడువు దాటి ఉన్న వినతుల పై ఆయా అధికారులు దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమ పరిధి లోనున్న పథకాలు, నిధులు, లక్ష్యాలు, సిబ్బంది తదితర వివరాలతో కూడిన వర్క్ ప్లాన్ వెంటనే అందించాలని ఆదేశించారు. జిల్లాల విభజన నేపథ్యం లో ఈ- ఆఫీస్ ఫైళ్లను పార్వతీ పురం మన్యం జిల్లాకు సంబంధించిన ఫైళ్లు అన్ని శాఖల నుండి సోమవారం సాయంత్రానికల్లా పంపాలని ఆదేశించారు. ఇందులో సందేహాలుంటే ఎం.ఐ.సి లో సంప్రదించాలన్నారు.
ఇక పై రెవిన్యూ డివిజనల్ అధికారులే వారి డివిజన్ కు సంబంధించి అభివృద్ధి, సంక్షేమం, రెవిన్యూ తదితర అంశాలన్నీ చూస్తారని అన్నారు. డివిజన్ వారీగా అన్ని పథకాల పై, సిబ్బంది ఖాళీలు, డివిజన్లో హైలైట్స్ , ఎందులో బలంగా ఉన్నారు , ఎందులో బలహీనంగా ఉన్నారు తదితర అన్ని అంశాల పై సమగ్ర నివేదికలను మంగళవారం నాటికి అందజేయాలని ఆదేశించారు. డివిజన్ల వారీ సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.