District Collector Smt. A. Suryakumari said in a statement that efforts are being made to achieve complete literacy in the district through the Padana Likhana Abhiyan program.
Publish Date : 20/04/2022
పడనా లిఖనా కార్యక్రమం ద్వారా సంపూర్ణ అక్షరాశ్యతకు కృషి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 20:: పడనా లిఖనా అభియాన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో సంపూర్ణ అక్షరాశ్యతను సాధించేందుకు కృషి జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు మార్చి, 2018 నుండి సాక్షర భారత్ కార్యక్రమం ముగిసిందన్నారు. ఈ కార్యక్రమం తరువాత 2018 – 19 విద్యా సంవత్సరంలో చిట్టిగురువులు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. చదువుకుంటున్న పిల్లలే తమ తల్లితండ్రులను అక్షరాస్యులను చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం జిల్లాలోని 34 మండలాలలో సర్వే జరిపించి, 55,841 మంది నిరక్షరాస్యులను గుర్తించి, ఈ కార్యక్రమాన్ని నిర్వహంచడం జరిగిందని తెలిపారు. 2019 ఫిబ్రవరి 09న చిట్టి గురువులు అభ్యాసకులకు అర్హత పరీక్ష నిర్వహించామని, 31,833 హాజరవ్వగా వారిలో 28,627 మంది ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు.
వయోజన విద్యాశాఖ డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా, జిల్లాలో సగటు అక్షరాస్యత కంటే తక్కువ గల 10 మండలాల్లో మార్చి, 2021 న జిల్లాలో పడనా లిఖనా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా 46,825 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలపారు. దీనికోసం 10 మండలాల్లో వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి 39,336 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు చెప్పారు. అయితే కోవిడ్-19 కారణంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి, 2021 డిసెంబరులో వలంటీర్ల ద్వారా స్వచ్ఛందంగా ప్రారంభించి, వయోజన విద్యాశాఖకు చెందిన ఇద్దరు (ఉపాధ్యాయులు) పర్యవేక్షకుల పర్యవేక్షణలో 2022 మార్చి 31న ముగించడం జరిగిందని తెలిపారు. అనంతరం వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఇద్దరు పర్యవేక్షకుల్లో ఒకరు ప్రస్తుతం సహాయ ప్రాజెక్టు అధికారిగా శ్రీకాకుళం జిల్లాలో, మరొకరు ఫారిన్ సర్వీసుపై మైనార్టీ సంక్షేమశాఖలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఒక ఉప సంచాలకులు, ఒక సహాయ సంచాలకులు మాత్రమే వయోజన విద్యాశాఖలో విధులు నిర్వర్తిస్తున్నారని, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయని పేర్కొన్నారు. అక్షరాస్యతను పెంచేందుకు నిర్వహించిన పలు కార్యక్రమాల ద్వారా జిల్లాలోని అక్షరాస్యత ప్రస్తుతం 76 శాతానికి పెరిగిందని, దీనిని 90 శాతానికి చేర్చేందుకు దశల వారీగా వివిద కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. వయోజన విద్యాశాఖలో అందుబాటులో ఉన్న కేవలం ఇద్దరు అధికారులతోనే, స్వచ్చందంగా ముందుకు వచ్చిన వలంటీర్ల సహకారంతో జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు.