Collector who inspected EVM warehouses
Publish Date : 04/05/2022
ఈవిఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం, మే 02 ః
నెల్లిమర్లలోని ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సోమవారం తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీళ్లను పరిశీలించారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.