MIG layouts at affordable prices, 20% rebate for government employees, pensioners, clear title for disputes, must be applied for by the 27th of this month, District Collector Surya Kumari
Publish Date : 06/05/2022
సరసమైన ధరలకు ఎం.ఐ.జి లే ఔట్లు
- ప్రభుత్వ ఉద్యోగులకు, పించన్ దారులకు 20 శాతం రిబేట్
- వివాదాలకు తావులేని క్లియర్ టైటిల్
- ఈ నెల 27 లోగా దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, మే 05 : మధ్యతరగతి ఆదాయ ప్రజలకు సొంతింటి కల సాకారం చేసేందుకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పధకం లో భాగంగా విజయనగరం జిల్లాలో డి.టి.సి.పి వారిచే అమోదించబడిన లే ఔట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా క్లియర్ టైటిల్ అందించడం జరుగుతుందని, పర్యావరణ రహితంగా ఉండేలా లే ఔట్లను అభివృద్ధి చేసి అందించడం జరుగుతునని తెలిపారు.
విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం రఘుమండ లో 22.46 ఎకరాలలో 11.23 కోట్ల రూ. ఖర్చు తో అభివృద్ధి చేసి వేసిన 287 ప్లాట్లు, బొండపల్లి మండలం జియ్యన్నవలస లో 12.31 ఎకరాల్లో 6.15 కోట్ల ఖర్చు తో వేసిన 152 ప్లాట్ల లో ఎం.ఐ.జి -1లో 150 చ.గ.లు, ఎం.ఐ.జి.-2 క్రింద 200 చ.గ.,లు ఎం.ఐ.జి -3 లో 240 చ.గలో మొత్తం 439 ప్లాట్ లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అర్హతలు:
ఈ ఎం.ఐ.జి ప్లాట్ కోసం వార్షిక గృహ ఆదాయం ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన మార్గదర్శకాల ప్రకారం 18 లక్షల రూపాయల లోపు ఉండాలని, లబ్దిదారు వయసు 18 సం. లు నిండి ఉండాలని, ఆంధ్ర ప్రదేశ్ నివాసి అయి ఉండాలని, దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే అదార్ కార్డు ను కలిగి ఉండాలని కుటుంబానికి ఒక ప్లాట్ మాత్రమే కేటాయించాబడుతుందని తెలిపారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ వెబ్సైటు http://migapdtcp.ap.gov.in నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్లాట్ విక్రయ ధరలో 10 శాతం ప్రారంభ చెల్లింపు చేయవలసి ఉంటుందన్నారు. దరఖాస్తు చివరి తేది మే నెల 27 లోగా చేయాలన్నారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఆన్లైన్ లాటరీ ద్వారా కేటాయింపు జరుగుతుందన్నారు. లాటరీ లో ప్లాట్ దక్కని లబ్దిదారులకు వారు చెల్లించిన 10 శాతం ప్రారంభపు విలువను ఒక నెల లోగా వడ్డీ లేకుండా వాపసు ఇవ్వబడుతుందన్నారు . తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు, పించన్ దారులకు వేర్వేరుగా లాటరీ తీయడం జరుగుతుందని, చివరగా జనరల్ కేటగరీ క్రింద లాటరీ తీయడం జరుగుతుందన్నారు.
ప్లాట్ ధర చెల్లింపు విధానం:
10 శాతం దరఖాస్తు తో పాటు చెల్లించాలని, అగ్రిమెంట్ జరిపిన 1 నెల లోపు 30 శాతం, కేటాయింపు జరిపినప్పటి నుండి 6 మాసాలలో 30 శాతం, మిగిలిన 30 శాతం అగ్రిమెంట్ జరిపిన 12 నెలల్లో లేదా రిజిస్ట్రేషన్ తేదీ నాటికీ ఏది ముందు అయితే దాని లోగా చెల్లించవలసి ఉంటుందన్నారు. దరఖాస్తు దారుడు అగ్రిమెంట్ జరిపిన నెల లోగా మొత్తం చేల్లిన్చినచో 5 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లే అవుట్ నందు 10 శాతం ప్లాట్ లను రిజర్వు చేయడమే కాకుండా ధరలో 20 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఖర్చులను దరఖాస్తుదరుడే భరించవలసి ఉంటుందని స్పష్టం చేసారు. ఇతర సందేహాల కోసం విశాఖపట్నం, సిరిపురం లో నున్న వి.ఎం.ఆర్.డి.ఏ కార్యాలయం లో సంప్రదించవచ్చని తెలిపారు.
