Collector who inspected the Inter Test Centers
Publish Date : 06/05/2022
ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
గరివిడి, గుర్ల (విజయనగరం), మే 06 ః ఇంటర్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి తనిఖీ చేశారు. గరివిడిలోని శ్రీరామా జూనియర్ కళాశాలను, గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచే మొదలైన నేపథ్యంలో, ఆయా పరీక్షా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి సెంటర్‌లో త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని, పకడ్భంధీగా పరీక్షలను నిర్వహించాలని, చూసిరాతలను నివారించాలని కలెక్టర్ ఆదేశించారు.