District Collector who inspected the Inter Examination Centers
Publish Date : 09/05/2022
ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
విజయనగరం, మే 09 : నగరంలోని పలు ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.సూర్యకుమారి సోమవారం తనిఖీ చేశారు. శ్రీనివాస జూనియర్ కళాశాల, ఎం.ఎస్.ఎన్.జూనియర్ కళాశాల తదితర పరీక్షా కేంద్రాలను సందర్శించి ప్రైవేటు కళాశాలల్లో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పలు గదుల్లో విద్యార్ధులు పరీక్ష రాస్తున్న విధానం, వారికి కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల్లో విద్యార్ధుల హాజరుపై పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్‌లతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణ పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.