Close

146 requests for response, District Collector Suryakumari

Publish Date : 09/05/2022

స్పందనకు 146 వినతులు

జిల్లా కలెక్టర్ సూర్యకుమారి

విజయనగరం, ఏప్రిల్  09::  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 146 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 21 డి.ఆర్.డి.ఏ కు 09 అందగా  రెవిన్యూ కు సంబంధించి 116 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టరు పద్మావతి, డి.ఆర్.డి.ఏ పి.డి డా.అశోక్ కుమార్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు.

        వికలాంగుల కోటా లో ఉద్యోగాలకు ప్రత్యేకంగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా   8 మందిని ఎంపిక చేసి 7 గురుకి గత వారం లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వగా మిగిలిన ఒకరికి స్పందన లో సోమవారం  పోస్టింగ్ ఆర్డర్ కలెక్టర్ అందజేశారు.   వీరికి మున్సిపల్ కార్పోరేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు.

అదే విధంగా క్రీడలలో మెడల్స్ ను సాధించిన క్రీడాకారులను అభిన దించారు.

146 requests for response, District Collector Suryakumari