District Collector A. Suryakumari inspected the Jonada village secretariat in Denkada zone on Monday morning.
Publish Date : 30/05/2022
జొన్నాడ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం, మే 30 : డెంకాడ మండలంలోని జొన్నాడ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. పథకాల తాలూకా లబ్ధిదారుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీల్లో జరుగుతున్న నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. వివిధ పథకాలకు, పనులకు సంబంధించిన నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయానికి వచ్చిన కొంత మంది స్థానికులతో కలెక్టర్ కాసేపు మాట్లాడారు. సచివాలయంలో అందుతున్న సేవల గురించి, సిబ్బంది పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డెంకాడ తహశీల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు.
