Chief Minister Jagan Mohan Reddy announced in a video conference that the special anti-corruption mobile app 14400 will be available in June for machinery, crop insurance and Ammoodi.
Publish Date : 06/06/2022



విజయనగరం, జూన్ 01:: రాష్ట్రంలో అవినీతిని నిరోదించడానికి 14400 అనే ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లుగా అనుమానం ఉన్న ఈ యాప్ ను ఆన్ చేస్తే యాప్ లో వాయిస్, వీడియో రికార్డ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ మూడేళ్ళ కాలం లో రాష్ట్రంలో 1 లక్ష 41 వేల కోట్ల రూపాయలను పారదర్శకంగా లబ్ది దారులకు అందించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవినీతి కి తావు లేకుండా అందించడం జరిగిందన్నారు. ఇక పై కూడా మరింత నిబద్ధత తో పారదర్శకంగా జరిగేలా చూస్తామన్నారు. ఈ మొబైల్ యాప్ ద్వారా సచివాలయం నుండి జిల్లా స్థాయి వరకు ఎక్కడ అవినీతి జరిగినా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి ఈ యాప్ పై అవగాహన కలిగించాలని తెలిపారు.
బుధవారం ముఖ్యమంత్రి కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, ఏఎంసియు , బిఎంసియు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీల భవన నిర్మాణాల పురోగతి, హౌసింగ్, ఇళ్ళ స్థలాలు, జగనన్న భూహక్కు మరియు భూ రక్ష పథకం అమలు, స్పందన గ్రీవెన్స్, వ్యవసాయం – ఖరీఫ్ సంసిద్ధత, నేషనల్ హై వేస్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ జూన్ మాసం లో అందించనున్న సంక్షేమ పథకాలను ప్రకటించారు. 7వ తేదీన రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 14వ తేదీన ఖరీఫ్ కు సంబంధించి పంటల బీమా , 23 న అమ్మ ఒడి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అర్హులైన లబ్ది దారులందరికీ ఈ పథకాలు పారదర్శకంగా అందేలా చూడాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
