Renovation of R&B roads in the district, repair work of roads today – Rs. 140 crore sanctioned today, District Collector Surya Kumari
Publish Date : 06/06/2022
జిల్లాలో ఆర్ అండ్ బి రోడ్లకు కొత్తరూపు
రోడ్ల మరమ్మత్తు పనులు నాడు- నేడు
రూ.140 కోట్ల నిధులు మంజూరు
జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
విజయనగరం, జూన్,04: జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మత్తులు ముమ్మరంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదివరకెన్నడూ లేనంతగా ఒకే ఏడాది రూ.140 కోట్ల నిధులు జిల్లాలో రోడ్ల మరమ్మత్తులకు మంజూరయ్యాయని, ఈ నిధులతో 66 రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 600 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. న్యూ డెవలప్ మెంటు బ్యాంకు నిధులతో మరో ఏడు ప్రధాన రహదారులను 91 కిలోమీటర్ల మేరకు మెరుగుపరచడం జరుగుతోందని, ఈ పనులన్నింటినీ జూన్, జూలై నాటికి పూర్తిచేసే లక్ష్యంతో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లకు ఆదేశించడం జరిగిందన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే జిల్లాలోని రహదారులకు మహర్ధశ వస్తుందని, జిల్లాలో రోడ్లు భవనాల శాఖ పరిధిలో మొత్తం 1950 కిలోమీటర్ల రహదారులు వుంటే అందులో 691 కిలోమీటర్లు అంటే దాదాపు మూడో వంతు రోడ్లు కొత్తరూపు సంతరించుకోనున్నాయని తెలిపారు.
నాడూ-నేడు కార్యక్రమం క్రింద రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారుల మరమ్మతు కోసం ఇప్పటికే 44 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతోపాటు, ఒప్పందాలు కూడా జరిగాయని, వీటిలో 10 రహదారుల మరమ్మతు పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. విజయనగరం-కొత్తవలస, విజయనగరం-పాలకొండ రోడ్ల మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయన్నారు. ఇంకా చిలకపాలెం-రామభద్రాపురం-రాయగడ, భీమసింగి-ఎస్.కోట, నీలకంఠాపురం-లేవిడి, పాలకొండ-శ్రీకాకుళం-కళింగపట్నం పనులు ప్రగతిలో ఉన్నాయని, ఇవి కాకుండా, మరో ఏడు ప్రధాన రహదారుల విస్తరణ పనులను కూడా చేపడుతున్నారని, విజయనగరం-చింతపల్లి, గజపతినగరం-జిన్నాం, సోంపురం-ఆనందపురం, విజయనగరం-కొత్తవలస, మక్కువ-అచ్చాడ, సాలూరు-దుగ్గేరు, తోటపల్లి-గుణానుపురం రోడ్లను విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు.
మరమ్మత్తుల వివరాలు:
Ø విజయనగరం నుండి పాలకొండ రహదారి 18 కి.మీటర్లను 6.90 కోట్ల అంచనా విలువతో మరమ్మత్తులు చేయడం జరిగింది.
Ø చీపురుపల్లి నుండి లావేరు 10 కి.మీ రహదారికి మరమ్మత్తులకు 3.50 కోట్లు
Ø నడుపూరు నుండి ఆనందపురం వరకు ప్రత్యేక మరమ్మ్తతులకు 60 లక్షలు
Ø అయినాడ నుండి చింతలవలస రోడ్డుకి కోటి రూపాయలు
Ø ఇవి కాకుండా విజయనగరం నుండి నాతవలసకు, హైవే నుండి కంచేరు వరకు ప్రత్యేక మరమ్మత్తులు చేపట్జడం జరిగింది.
