Housing should be expedited, District Collector A. Suryakumari, A. Ravivalasa Secretariat Inspection
Publish Date : 14/06/2022
గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఏ.రావివలస సచివాలయం తనిఖీ
భోగాపురం, జూన్ 09 ః గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మండలంలోని ఏ.రావివలస సచివాలయాన్ని, ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును, రికార్డులను తనిఖీ చేశారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రశ్నించారు. గ్రామంలో జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులంతా తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాలని, లేదంటే రద్దు అయిపోతాయని స్పష్టం చేశారు. గృహనిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఓటిఎస్‌పై ఆరా తీశారు. సచివాలయ పరిధిలోని పాఠశాలల్లో పదోతరగతి ఫలితాలపై ప్రశ్నించారు. పిల్లలు ఎత్తు, బరువు కొలుస్తున్నదీ లేనిదీ, పోషకాహార పంపిణీ తదితర కార్యక్రమాలపై ఎఎన్ఎం, అంగన్‌వాడీలను ప్రశ్నించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కనర్వర్జెన్సీ పనులపై ఆరా తీశారు. వెంటనే పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ భవనాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
