Close

District Collector A. Suryakumari ordered to register this crop after inspecting the crops at the field level.

Publish Date : 01/10/2022

పంట‌ను ప‌రిశీలించాకే ఈ-క్రాప్ న‌మోదు

జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

మెర‌క‌ముడిదాం (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 30 ః క్షేత్ర‌స్థాయిలో పంట‌ల‌ను ప‌రిశీలించిన త‌రువాతే ఈ క్రాప్ న‌మోదు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. మెర‌క‌ముడిదాం మండ‌లం చిన బంటుప‌ల్లి రైతు భ‌రోసా కేంద్రాన్ని, స‌చివాల‌యాన్ని ఆమె శుక్ర‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా రైతుభ‌రోసా కేంద్రంలోని రికార్డుల‌ను ప‌రిశీలించారు. గ్రామంలో సాగుభూమి విస్తీర్ణం, రైతుల సంఖ్య‌, పంట‌ల ప‌రిస్థితి, ఈ క్రాప్ న‌మోదుపైనా ఆరా తీశారు. క్షేత్ర‌స్థాయిలో పంట‌ల‌ను ప‌రిశీంచాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా, వేసిన ప్ర‌తీ పంట‌నూ ఈ క్రాప్ చేయాల‌ని సూచించారు. గ్రామంలో ప‌నిచేసే విఆర్ఓలు, వ్య‌వ‌సాయ సిబ్బందికి, ఆ గ్రామంలో పండే పంట‌లు, రైతుల ప‌రిస్థితిపై అవ‌గాహ‌న ఉండాల‌ని అన్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన‌ప్పుడు మాత్ర‌మే, గ్రామంపై సంపూర్ణ అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. గ్రామంలో చిట్టిగురువులు కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బంధీగా నిర్వ‌హించి, వ‌యోజ‌నుల‌ను అక్ష‌రాస్యుల‌ను చేయాల‌ని కోరారు. పెద‌బంటుప‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. ఈ త‌నిఖీల్లో తాశీల్దార్ బి.ర‌త్న‌కుమార్‌, మండ‌ల వ్య‌వ‌సాయాధికారి జి.శ్రావ‌ణి పాల్గొన్నారు.

District Collector A. Suryakumari ordered to register this crop after inspecting the crops at the field level.