District Collector A. Suryakumari ordered to provide strong security to EVMs.

Publish Date : 04/10/2022
District Collector A. Suryakumari ordered to provide strong security to EVMs.

ఇవిఎంల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త‌
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), అక్టోబ‌రు 03 ః
ఇవిఎంల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. నెల్లిమ‌ర్ల‌లోని ఇవిఎం గొడౌన్ల‌ను, సోమ‌వారం క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, స్ట్రాంగ్ రూముల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి పోలీసు బందోబ‌స్తుపై ఆరా తీశారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.
ఈ త‌నిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, నెల్లిమ‌ర్ల తాశీల్దార్ ర‌మ‌ణ‌రాజు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.బాలాజీ ప్ర‌సాద్‌, ఎల‌క్ష‌న్ సూప‌రింటిండెంట్ మ‌హేష్‌, సిపిఐ నాయ‌కులు తాలాడ స‌న్నిబాబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.