The district’s reputation should be ironed out, the three-day program should be a success, said State Education Minister Botsa Satyanarayana.
Publish Date : 14/10/2022
జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి
మూడు రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలి
రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం, అక్టోబరు 09 ః విజయనగరం ఉత్సవాలలో ప్రజలంతా పాల్గొని ఉత్సవాలను విజయవంతం గావించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్సవ రాలీ అనంతరం ఆనందగజపతి ఆడిటోరియం లో జరిగిన ప్రారంభోత్సవ సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, ఇందుకూరి రఘు రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు కడుబండి శ్రీనివాస రావు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ రేవతి దేవి , సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా ఎస్.పి దీపిక , డి.అర.ఓ గణపతి రావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వరుణుడు కరుణించకపోయినా అశేష ప్రజానీకం రాలీ లో పాల్గొని విజయవంతం చేసారని ఇదంతా అమ్మవారి కృపా కటాక్షమని పేర్కొన్నారు. కోవిడ్ వలన గత రెండేళ్ళు గా ఉత్సవాలకు దూరంగా ఉన్నామని, ఈ ఏడాది ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా ఒక్కటై ఉత్సాహంగా ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వం లో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, చక్కగా కార్యాచరణను రూపొందించారని కలెక్టర్ ను అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి కి ఉప సభాపతి పదవిని ఇచ్చి గౌరవించడం జిల్లా గౌరవాన్ని పెంచినట్లయ్యిందని పేర్కొన్నారు.
కళాకారులకు ప్రోత్సాహం : ఉప సభాపతి కోలగట్ల
జిల్లా నుండి అనేక మంది కళాకారులు జాతీయ , అంతర్జాతీయ స్థాయి లో తమ సత్తాను చాటుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. విజయనగరం ఉత్సవాలలో వినోదాన్ని పంచాలనే పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని అన్నారు. జిల్లాకు చెందిన కళలకు ఆదరణ తగ్గకూదడనే పులివేషాల ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అదే విధంగా నాటకరంగం కళాకారుల కోసం పలు నాటకాలు, నాటికలు, ఏక పాత్రాభినయాలు , పోటీలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం రాత్రి మెగా మ్యుజికల్ నైట్ కార్యక్రమాన్ని, 11 రాత్రి బాణా సంచా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ప్రజలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వినోదాన్ని పొందాలని కోరారు.
మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి : జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి
వరుణుడు పరీక్ష పెట్టినా తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్ళేమని , అందరి సహకారం రాలీ విజయవంతం అయ్యిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వాసులంతా బాధ్యతాయుతంగా పాల్గొనడం విశేషమని, ఈ ఉత్సవం అందరి మదిలో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. ఈ ఉత్సవాలకోసం విరాళాలు అందించిన వారికీ పేరు పేరునా ధన్యవాదాలని అన్నారు.
సభా సమావేశం అనంతరం మహారాజ సంగీత కళాశాల ఆధ్వర్యం లో గాత్ర కచేరి జరిగింది. అనంతరం 6 జిల్లాల నుండి విచ్చేసి సంగీత నృత్య పోటీలలో పాల్గొన్న వారికీ సెమి ఫైనల్స్ పోటీలను ఈ వేదిక పై నిర్వహించారు.
ఆకట్టుకున్న స్టాల్స్ : వీక్షించిన మంత్రివర్యులు
ఉత్సవాల్లో భాగంగా అయోధ్య మైదానం లో డి.అర.డి.ఎ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ , ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి , జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తదితరులు స్టాల్స్ ను సందర్శించారు. డి.అర్.డి.ఎ ఆధ్వర్యం లో 54 స్టాల్స్ ను ఏర్పాటు చేయగా వీటిలో మహిళల అలంకార వస్తువులు, చేనేత వస్త్రాలు, ఉప్పాడ పట్టు చీరలు, జ్యూట్ బాగ్స్ ప్రధాన ఆకర్షణ గా ఉన్నాయి. వీటి తో పాటు ఇత్తడి వస్తువులు తిను బండారాలు, చిరు ధాన్యాలు టెర్రా కోటా వస్తువులు, జి.సి.సి ఉత్పతులు, అప్పడాలు, స్నాక్స్, అలంకరణ మొక్కలు, అగర్బత్తీలు , చెప్పులు , భరినలు, వీణలు , పలు హస్తకళా రూపాలు, బెల్లం రుచులు, పచ్చళ్ళు, దుప్పట్లు, ఏటి కొప్పాక బొమ్మలు, ఆర్గానిక్ ఉత్పతులు, వన్ గ్రామ గోల్డ్ ఆభరణాలు తదితర వస్తువులు రాష్త్రం నలుమూలల నుండే కాకుండా పశ్చిమ బెంగాల్ నుండి, ఉత్తరాఖండ్ నుండి కూడా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అలరిస్తున్నాయి. చీరను ఎ ఫంక్షన్ కు ఎలా కట్టుకోవాలి అనే అంశం పై మహిళల కోసం సారీ డ్రాపింగ్ స్టాల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి డెమో ద్వారా నేర్పించడం ప్రత్యేకతను చాటుకుంది.
హోరెత్తిన జానపదం :
ఉత్సవాల్లో భాగంగా లైన్స్ క్లబ్ లో నిర్వహించిన జానపద నృత్యాలు హోరెత్తించాయి. పులివేషాలు , చెక్క భజన, జముకల కధలు, తదితర జానపద కళాకారుల నృత్యాలు రమణీయంగా ప్రదర్శించారు.