Close

Zilla Parishad Chairman Mazji Srinivasa Rao stated that the welfare of the farmers who provide rice to all is the main objective of the state government.

Publish Date : 21/10/2022

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

*జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

*జిల్లాలో 2.51 లక్షల మందికి రూ.106 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల

విజయనగరం, అక్టోబర్ 17:- అందరికీ అన్నం పెట్టే రైతన్నల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని.. దానిలో భాగంగానే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఆయా గ్రామాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానికంగానే అన్ని రకాల సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. వారిని ఆర్థికంగా ఆడుకుంటూ అన్ని వేళలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరుసగా నాలుగో ఏట రైతు భరోసా పథకం కింద ఈ ఏడాది రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆళ్లగడ్డ నుంచి ప్రారంభించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారితో కలిసి జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అను నిత్యం కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు భీమా సదుపాయం, రుణ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోందని ఉద్ఘాటించారు. ఈ రోజు రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2,51,390 మంది లబ్ధి పొందారని వివరించారు. రూ.106.23 కోట్ల నిధులను వారి ఖాతాలకు జమ చేశామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలోని రైతు సోదరులకు రూ.1219.95 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశామని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ గుర్తు చేశారు. రైతులకు ఏ కష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

క్రమంలో భాగంగా రూ.106.23 కోట్ల విలువ గల మెగా చెక్కును జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘురాజు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, డి.సి.ఎం.ఎస్. చైర్పెర్సన్ అవనాపు భావన, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జి. వేంకటేశ్వర రావు చేతుల మీదుగా లబ్ధిదారులైన రైతులకు అందజేశారు.

కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి వి.టి. రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు, డి.సి.ఎం.ఎస్. చైర్ పర్సన్ భావన, ఇతర సభ్యులు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ ఏడి అన్నపూర్ణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Zilla Parishad Chairman Mazji Srinivasa Rao stated that the welfare of the farmers who provide rice to all is the main objective of the state government.