పెద్దచెరువును పరిశీలించిన కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
Publish Date : 29/10/2025
విజయనగరం, అక్టోబరు 28 ః

2910-A

2910-B

2910-C
పట్టణంలోని పెద్దచెరువును జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. భారీ వర్షాలవల్ల పెద్దచెరువు పొంగి పొరలుతున్న కారణంగా, నీటి మట్టం పరిస్థితి, నీటిని బయటకు పంపించే కాలువల గురించి మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, గండి పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆదేశించారు. పెద్దచెరువు నీరు రోడ్డుపైకి రాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.