Close

29.10.2025 తుఫాన్ నష్టాలను తక్షణమే పంపాలి, మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం వెంటనే అందజేయాలి, తుఫాన్ లో సమర్ధవంతంగా పని చేసిన అధికారులకు, సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపిన కలెక్టర్

Publish Date : 30/10/2025

పత్రికా ప్రకటన-2
👉 తుఫాన్ నష్టాలను తక్షణమే పంపాలి
👉 మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన సహాయం వెంటనే అందజేయాలి
👉  తుఫాన్ లో సమర్ధవంతంగా  పని చేసిన అధికారులకు, సచివాలయ సిబ్బందికి అభినందనలు  తెలిపిన కలెక్టర్
విజయనగరం, అక్టోబరు 29:  తుఫాన్ వలన సంభవించిన నష్టాలను వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన నష్టాలను తెలియజేస్తూ వాటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చు అంచనాలను కూడా బుధవారం సాయంత్రం లోగానే పంపాలని తెలిపారు. నష్టాల అంచనాలు ఖచ్చితంగా ఉండాలని, ప్రత్యక్షంగా చూసి రాయాలని, వాటి ఫోటోల తో సహా పంపాలని తెలిపారు.
బుధవారం ఉదయం కలెక్టర్  జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్బంగా మండల వారీగా అన్ని శాఖలకు సంబంధించిన నష్టాల పై ఆరా తీశారు.  తాత్కాలిక పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని, శాశ్వత పనుల కోసం అంచనాలను తయారు చేసి పంపాలని అన్నారు.
 వేటకు వెళ్ళని కారణం గా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీ ల బియ్యం వెంటనే అందించాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు వాస్తవ లబ్ధిదారుల జాబితాను సిద్ధం  చేయాలని, సంయుక్త కలెక్టర్ తో చర్చించి పంపిణీ వెంటనే జరిగేలా చూడాలని అన్నారు.
తుఫాన్ లో నిరంతరంగా క్షేత్ర స్థాయి లో తిరుగుతూ, సమర్ధవంతంగా జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది 24/7 పని చేసారని, వారి సేవలు ఆమోఘమని, వారందరినీ జిల్లా కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన సేవల పట్ల సంతృప్తి చెంది అభినందించారని కలెక్టర్ తెలిపారు.  ఇదే స్ఫూర్తి తో ఇంకో రెండు రోజులు పని చేయవలసి ఉంటుంది, ఏ ఒక్కరూ రిలాక్స్ కావద్దని తెలిపారు.
==========
జారీ డిఐపిఆర్ఒ, విజయనగరం

2910

2910