Close

29.10.2025 *శుద్ధ జలము సరఫరా చేయండి**అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి* జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

Publish Date : 30/10/2025

పత్రికా ప్రకటన-3
*శుద్ధ జలము సరఫరా చేయండి*
*అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి*
-జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం/తెర్లాం, అక్టోబర్ 29: జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బుధవారం తెర్లాం మండలంలోని గంగన్నపాడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు.  ఆ గ్రామం లో నర్సిపల్లి వారి బంధ చెరువు ఓవర్ ఫ్లో కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో నీటి ప్రవాహం కొనసాగుటుండటం గమనించిన కలెక్టర్ ఇరిగేషన్ ఏఈ తో మాట్లాడి తక్షణం నీటి ప్రవాహం బయటకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ఎవరూ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు😭 తీసుకోవాలని సూచించారు. నీటి మట్టం పెరిగిన ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.  ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలను అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారని పేర్కొన్నారు. నవంబర్ నెల కోట బియ్యం పంపిణీ జరుగుతున్నది లేనిది ఆరా తీశారు.
నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన తరువాతనే ఆయా కుటుంబాలను తిరిగి తమ ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు కలెక్టర్ గారు ఆదేశించారు.
అదేవిధంగా, వరద నీరు తగ్గిన తర్వాత గ్రామంలోని బోర్లు, హ్యాండ్పంపులు, నీటి ట్యాంకులలోని త్రాగునీటిని పరీక్షించి మాత్రమే ప్రజలకు సరఫరా చేయాలని, అప్పటివరకు వాటర్ ట్యాంకర్ల ద్వారా శుద్ధ జలాన్ని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూ‌ఎస్‌ అధికారులను ఆదేశించారు.
తుఫాన్ అనంతరం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున గ్రామంలో శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్ రావు,  తాసిల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీవో రాంబాబు, ఇరిగేషన్ ఎఇ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
==========(=
జారీ: డి ఐ పి ఆర్ ఓ విజయనగరం

2910-A

2910-A

2910-B

2910-B

2910-C

2910-C