Close

05.11.2025 పోష‌కాహారాన్ని స‌కాలంలో అందించాలి, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్‌

Publish Date : 06/11/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-3

పోష‌కాహారాన్ని స‌కాలంలో అందించాలి

జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్‌

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 05 ః   గ‌ర్భిణులు, బాలింత‌ల‌కు పోష‌కాహారాన్నిస‌కాలంలో అందించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ ఆదేశించారు. జిల్లా స్థాయి ఎస్ఎన్‌పి (సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం) స‌మావేశం జెసి ఛాంబ‌ర్‌లో బుధ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో  జాయింట్ కలెక్టర్, క‌మిటీ చైర్మన్ జెసి మాట్లాడుతూ, అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు స‌క్ర‌మంగా సరుకుల‌ను అందించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.  అలాగే పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ద్వారా అందిస్తున్న‌ బియ్యం, ప‌ప్పు, నూనె స‌ర‌ఫ‌రాలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాల‌ని, నాణ్య‌మైన స‌రుకుల‌నే స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించారు. జిల్లాలో  2,499 అంగన్వాడీ కేంద్రాల‌లో బాల సంజీవని పథకం లబ్ధిదారులకు స‌కాలంలో స‌రుకులు అందేలా చూడాల‌ని చెప్పారు.

          ఈ కార్యక్రమంలో  ఐ‌సి‌డి‌ఎస్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌ టి.విమల రాణి, సివిల్ స‌ప్ల‌యిస్ డిఎం బొడ్డేపల్లి .శాంతి, పిఓఎన్‌సిడి సుబ్రమణ్యం, సి‌డి‌పి‌ఓలు, స‌రుకుల స‌ర‌ఫ‌రాదారులు పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

5-11-A

5-11-A

5-11-B

5-11-B