దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ
Publish Date : 11/11/2025
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న (0-18) సంవత్సరాల మధ్య వయసు గల దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ చేయుటకు అర్హులైన విద్యార్థులను గుర్తించు నిమిత్తం నియోజకవర్గ స్థాయిలో వైద్య శిబిరాలు క్రింది పేర్కొన్న తేదీలలోనిర్వహించబడనున్నాయి.
| వరుస సంఖ్య | అసెంబ్లీ నియోజక వర్గం పేరు | వైద్యశిభిరం నిర్వహించనున్న స్థలంపేరు | అసెంబ్లీ నియోజక వర్గం లో వుండే మండలాల పేర్లు | వైద్య శిభిరం నిర్వహించనున్న తేది |
| 1 | గజపతినగరం | గజపతినగరం | గజపతినగరం | 10.11.2025 |
| దత్తిరాజేరు | ||||
| మెంటాడ | ||||
| బొండపల్లి | ||||
| గంట్యాడ | ||||
| 2 | బొబ్బిలి | రామభద్రపురం | రామభద్రపురం | 11.11.2025 |
| బొబ్బిలి | ||||
| బాడంగి | ||||
| తెర్లాం | ||||
| 3 | రాజాం | రాజాం | రాజాం | 12.11.2025 |
| ఆర్.ఆముదాలవలస | ||||
| వంగర | ||||
| సంతకవిటి | ||||
| 4 | చీపురుపల్లి | గరివిడి | గుర్ల | 13.11.2025 |
| గరివిడి | ||||
| చీపురుపల్లి | ||||
| మెరకముడిదం | ||||
| 5 | విజయనగరం & నెల్లిమర్ల | డెంకాడ | డెంకాడ | 14.11.2025 |
| భోగాపురం | ||||
| పూసపాటిరేగ | ||||
| విజయనగరం | ||||
| నెల్లిమర్ల | ||||
| 6 | ఎస్.కోట | ఎస్.కోట | ఎస్.కోట | 15.11.2025 |
| జామి | ||||
| కొత్తవలస | ||||
| వేపాడ | ||||
| ఎల్.కోట |
దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల అర్హత నిర్ధారణ కోసం క్రింది ధృవపత్రాలతో తప్పనిసరిగా హాజరు కావలసిందిగా కోరడమైనది.
వైద్య శిబిరంనకు తీసుకొని రావలసిన ధృవపత్రాలు:
- విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
- సదరం సర్టిఫికేట్
- UDIDకార్డు
- రేషన్ కార్డు / ఆదాయ ధృవపత్రం
- విద్యార్థి ఫోటో
ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని, దివ్యాంగ విద్యార్థులు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి అర్హత సాధించగలరని తెలియజేయడమైనది.
అదనపు పధక సమన్వయకర్త,
సమగ్ర శిక్ష, విజయనగరం.