Close

పత్తి రైతులు కోనుగోలు కేంద్రాలోనే విక్రయించాలి జిల్లాలోపత్తి రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లాకలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

Publish Date : 13/11/2025

 పత్తి  రైతులు కోనుగోలు కేంద్రాలోనే విక్రయించాలి

 జిల్లాలో పత్తి రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభం

 జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

విజయనగరం, నవంబర్ 12: జిల్లా పత్తి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులంతా ఈ కొనుగోలు కేంద్రం లొనే వారి పంటను విక్రయించాలని, దళారీలను, మధ్యవర్తుల ను నమ్మవద్దని తెలిపారు.

 రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని  శాసన సభ్యులు మరియు  అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, రాజాం శ్రీ కొండ్రు మురళీ మోహన్ గారు ప్రారంభించారాణి తెలిపారు.

రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పత్తి రైతులకు కలెక్టర్  విజ్ఞప్తి చేశారు.

పత్తి రైతులు తమ ఉత్పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) రూ.8,110/- కంటే తక్కువ ధరకు మధ్యవర్తులకు విక్రయించకుండా, నేరుగా రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద విక్రయించాలని కోరారు.

ఇప్పటికే పత్తి సాగు ఉన్న 140 గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు

పారదర్శకమైన తూకం,

న్యాయమైన ధర,

తక్షణ చెల్లింపు సదుపాయాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

——————————————————-

జారీ: జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, విజయనగరం.

 

1211-C

1211-A

1211-A

1211-B

1211-B

1211-C