రైతు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కలిగించాలి • ఉద్యాన పంటల పై దృష్టి పెట్టాలి • గంట్యాడ, బొండపల్లి మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన కలెక్టర్
Publish Date : 15/11/2025
రైతు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కలిగించాలి
- ఉద్యాన పంటల పై దృష్టి పెట్టాలి
- గంట్యాడ, బొండపల్లి మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు చేసిన కలెక్టర్
విజయనగరం, నవంబర్ 14 : రైతులు పండించే పంటకు మార్కెట్ సౌకర్యం లేకుంటే రైతు ఇబ్బంది పడతారని, పంటను విక్రయించుకునే వెసలుబాటు కల్పించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ గంట్యాడ, బొండపల్లి మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించి మామిడి, టమాట, రైతులు పండిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని, ఉద్యాన పంటలను సందర్శించారు. కోటారుబిల్లి గ్రామం లో ఈ పంట సూపర్ చెక్ లో భాగంగా నమోదును పరిశీలించారు. వరి, మామిడి పొలాలను సందర్శించి, ఈ పంట నమోదు పై సంతృప్తిని వ్యక్తం చేసారు. అదే విధంగా రైతులతో మాట్లాడి వరి, మామిడి పంట విషయం లో ఉన్న ఇబ్బందులను గురించి చర్చించారు. కొండతామరాపల్లి లో టమాటా పంటను పరిశీలించారు. వరి పంట లో రైతులకు నికర ఆదాయం తక్కువగా ఉన్నందున ఉద్యాన పంటల వైపు మళ్ళించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. తదుపరి కొవ్వాడ లో సాగు అవుతున్న ప్రకృతి సేద్యం రైతుల పొలాలను పరిశీలించారు. ప్రధానంగా మార్కెటింగ్ సదుపాయం పై దృష్టి పెట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రజలందరికి ఆరోగ్య కరమైన ఆహారం తినడం పై అవగాహన పెరిగిందని, దీనిని దృష్టి లో పెట్టుకొని మరింత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం సాగు చేసేలా అవగాహనా కలిగించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి తారక రామారావు , ఉద్యాన అధికారి చిట్టి బాబు, ఇతర వ్యవసాయ, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.
—————————————————————–
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం


1511-A
1511-B

1511-C