Close

21.11.2025 పకడ్బందీగా ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జెసి సేధు మాధవన్

Publish Date : 22/11/2025

పత్రికా ప్రకటన

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు

కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జెసి సేధు మాధవన్

బొబ్బిలి, రామభద్రాపురం (విజయనగరం), నవంబర్ 21 :  ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధుమాధవన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఆయన శుక్రవారం బొబ్బిలి, రామభద్రాపురం మండలాల్లో పర్యటించారు. బొబ్బిలి మండలం మెట్టవలస, రామభద్రపురం మండలం రొంపల్లి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు.

          ఈ పర్యటనలో తహసీల్దార్లు ఎం.శ్రీను, రఫీజాన్, డిటీ సాయికృష్ణ, మండల వ్యవసాయాధికారులు ఎం.శ్యాంసుందర్, ఎ.శివ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

.,………………………………………………………………………………………………………………………

జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

21-11-1

21-11-1

21-11-2

21-11-2

21-11-3

21-11-3