క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి*👉రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ 👉 ఉత్సాహంగా ప్రారంభమైన అండర్ 17 బాలికల ఖోఖో పోటీలు
Publish Date : 24/11/2025
క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి*
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఉత్సాహంగా ప్రారంభమైన అండర్ 17 బాలికల ఖోఖో పోటీలు
క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి*
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఉత్సాహంగా ప్రారంభమైన అండర్ 17 బాలికల ఖోఖో పోటీలువిజయనగరం, నవంబర్ 23:
గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆదివారం సాయంత్రం స్థానిక విజ్జి మైదానంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖోఖో క్రీడలో విజయనగరం జిల్లాకు ఎంతో పేరు ప్రఖ్యాతి ఉందని అన్నారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం బాలికలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఈ తరుణంలో బాలికలు పోటీలను ఇక్కడ నిర్వహించడం జిల్లాకు గర్వ కారణమని పేర్కొన్నారు. క్రీడా స్పూర్తితో ఆడి విజయం సాధించాలని.కోరారు. అనంతరం పావురాలను ఎగురవేసి, క్రీడా పోటీలను ప్రారంభించారు.
మొట్ట మొదట విజయనగరం – గుంటూరు జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్ కి టాస్ వేసి ఆటను ప్రారంబించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపిసి రామారావు, డి ఎస్ డి ఓ ఎస్.వెంకటేశ్వరరావు, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మిలు, మండల విద్యా శాఖ అధికారి సత్యవతి, 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాద్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
…………..
జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.





2411-A


2411-G