పది పరీక్షలకు వందరోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను సిద్ధం చేయాలి అర్జీదారులసంతృప్తి స్థాయి పెరగాలి వారానికి 4 సార్లు సచివాలయాల తనిఖీ తప్పనిసరి– జిల్లా కలెక్టర్ Inbox
Publish Date : 23/12/2025
పది పరీక్షలకు వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను సిద్ధం చేయాలి
అర్జీదారుల సంతృప్తి స్థాయి పెరగాలి
వారానికి 4 సార్లు సచివాలయాల తనిఖీ తప్పనిసరి
– జిల్లా కలెక్టర్
విజయనగరం, డిసెంబరు 22:రాబోయే పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల విద్యా స్థాయిని నిరంతరం సమీక్షిస్తూ, బలహీన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ పై సమీక్షించారు. జిల్లాలోని 297 పాఠశాలల్లో 16,240 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరవుతున్నారని,వారంతా పాస్ అయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనని అన్నారు. ప్రత్యేకాధికారులు, మండల అధికారులు వారి లక్ష్యాల మేరకు తనిఖీలు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజువారీ బోధన ప్రణాళిక, వారానికొకసారి పరీక్షలు, మోడల్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సమగ్రంగా సిద్ధం చేయాలని తెలిపారు.
ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేక అధ్యయన ప్రణాళిక రూపొందించి, సందేహ నివృత్తి తరగతులు, అదనపు కోచింగ్, రివిజన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారి పురోగతిని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు.
పదో తరగతి ఫలితాలు జిల్లాకు ప్రతిష్టాత్మకమని, అందుకే విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది సమన్వయంతో పని చేసి శాతం 100 ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పీజిఆర్ఎస్ వినతులు పై సమీక్షిస్తూ అర్జీదారుల సంతృప్తి స్థాయి పెరిగేలా పరిష్కారం ఉండాలని అధికారులకు సూచించారు. అధికారుల కృషి వలన జిల్లాలో ప్రొసీజరల్ లాప్సేస్ తగ్గాయని అన్నారు. లాగిన్ లో రెండు పూటలా వినతులను చూడాలని, ఇంకా చూడవలసినవి ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని తెలిపారు. వినతులు ఆడిట్ పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
మండల ప్రత్యేకాధికారులు, ఆర్.డి.ఓ లు, మున్సిపల్ కమిషనర్లు సచివాలయాలను వారానికి 4 సార్లు తప్పక సందర్శించాలని, గూగుల్ షీట్ లో సందర్శన వివరాలను నమోదుచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్, డి.ఆర్.ఓ మురళి, జిల్లా అధికారులు, వర్చువల్ గా మండల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.
——————————————————————————————
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

231225-A

231225-B