ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి Inbox
Publish Date : 23/12/2025
5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబరు 21 ః
ఐదేళ్ల ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. స్థానిక కంటోన్మెంటు మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆయన లాంఛనంగా ప్రారంభించి, పిల్లలకు పోలియో చుక్కలను వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సుమారు 2 లక్షల మంది పిల్లలకోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 1172 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు పోలింగ్ కేంద్రాల్లో చుక్కలను వేయడంతోపాటు, 22 నుంచి 23 వరకు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం 5000 మంది ఆరోగ్య కార్యకర్తలను గుర్తించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 24వ తేదీన కూడా పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలను వేస్తారని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, హైరిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. అందువల్ల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కోరారు. దేశంలో ఇప్పటికే పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగిందని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా పోలియో చుక్కలను వేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ కె.రాణి, డిఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డిఎన్ఎంఓ డాక్టర్ అర్చనాదేవి, ఏరియా డాక్టర్ అశోక్‌కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
………………………… ………………………… ………………………… ………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

231225-A

231225-B