Close

పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఘనంగా వీరబాల దివస్ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించినక‌లెక్ట‌ర్‌

Publish Date : 27/12/2025

పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

ఘనంగా వీరబాల దివస్

పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

 

విజయనగరం, డిసెంబర్ 26, 2025:   భారత భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవిస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించిన ‘వీర్ బాల్ దివస్’ వేడుకలు  జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. విమలారాణి మరియు ఇతర జిల్లా అధికారులు జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. వీర్ బాల్ దివ‌స్‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు.

 

కార్యక్రమ ముఖ్య లక్ష్యాలు:-

భారతదేశ భవిష్యత్తుకు పునాది అయిన పిల్లలను గౌరవించడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం.

యువ మనస్సులను సంస్కరించడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడం మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపడం.  దేశాభివృద్ధిలో పిల్లలు మరియు యువత చురుగ్గా పాల్గొనేలా ప్రేరేపిస్తూ, ‘వికసిత్ భారత్’ దార్శనికత వైపు వారిని నడిపించడం. పిల్లలలో ధైర్యం, త్యాగం మరియు దేశభక్తి వంటి విలువలను పెంపొందించడం.

 

ముఖ్య అంశాలు:-

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు, శిశు సంరక్షణ సంస్థలు, మరియు యువజన సంఘాల్లో ఈ వేడుకలు నిర్వహించబడతాయి. విద్యార్థుల వయస్సును బట్టి పెయింటింగ్, వ్యాసరచన, కథలు చెప్పడం, క్విజ్, గ్రూపు చర్చలు, మరియు స్కిట్స్ వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రాలీలు మరియు వాకథాన్‌లు: డిసెంబర్ 26 నుండి 30వ తేదీ వరకు జిల్లా మరియు మండల స్థాయిల్లో ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్  క్యాడెట్లు, మరియు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన రాలీలు, వాకథాన్‌లు నిర్వహించబడతాయి.

 

కార్యక్రమ ఉద్దేశ్యం:

పిల్లలలో దేశభక్తిని పెంపొందించడం, దేశాభివృద్ధిలో వారి పాత్రను గుర్తించడం, మరియు “వికసిత్ భారత్” , “ఆత్మనిర్భర్ భారత్” వంటి జాతీయ లక్ష్యాలపై వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.

 

కార్యక్రమ వివరాలు:

న్యూఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి వీరబాల దివస్ వేడుకలు రెండు సెషన్లలో సాగాయి ఉదయం 10:30 నుండి 12:00 గంటల వరకు విజ్ఞాన్ భవన్‌లో గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.

 

వీర్ బాల్ దివస్ ప్రధాన కార్యక్రమం:

మధ్యాహ్నం 12:30 గంటల నుండి భారత్ మండపంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పుర‌స్కారం పొందిన‌ పిల్లల‌తో సంభాషించారు.

 

జిల్లా భాగస్వామ్యం:-

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని డి.పి.ఒలు, సి.డి.పి.ఒలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ ప్రతినిధులు మరియు విద్యాసంస్థల ప్రతినిధులు తమ కార్యాలయాలు, పాఠశాలలు మరియు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయి వరకు ఈ వేడుకలను విస్తృతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు సిడిపిఓలు, డిసిపిఓ బిహెచ్ ల‌క్ష్మి, డీఎంసీ సుజాత, ఒన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సాయి విజయలక్ష్మి, సూపర్వైజర్లు ఇత‌ర సిబ్బంది, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

………………………………………………………………………………………….

జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.

261225-A

261225-A

261225-B

261225-B