ఈ నెల 31నే పింఛన్ల పంపిణీ, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Publish Date : 27/12/2025
ఈ నెల 31నే పింఛన్ల పంపిణీ
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబరు 26 ః సామాజిక పింఛన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. జనవరి 1కి బదులుగా ఒకరోజు ముందుగా ఈ నెల 31నే ఎన్టిఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలు నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వచ్చి పింఛన్లను అందజేస్తారని తెలిపారు. డిసెంబరు నెలకు గాను జిల్లాలో 2,71,697 మంది పింఛన్ దారులకు మొత్తం రూ.116.25 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.ఈ నగదును 30వ తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, సంబంధిత సచివాలయాల సిబ్బంది నగదు విత్డ్రా చేసుకొని, పింఛన్ల పంపిణీకి సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

231225-B