Close

27.12.2025 పారిశ్రామిక వృద్దికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు, 8 ప‌రిశ్ర‌మ‌ల ద్వారా 54 వేల మందికి ఉపాధికి ప్ర‌తిపాద‌న‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Publish Date : 29/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-2

పారిశ్రామిక వృద్దికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు

8 ప‌రిశ్ర‌మ‌ల ద్వారా 54 వేల మందికి ఉపాధికి ప్ర‌తిపాద‌న‌

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 27 ః   జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు  ఔత్సాహికుల‌కు విస్తృతంగా అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఈ నెలాఖ‌రులోగా స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని సూచించారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కోసం వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను సింగిల్ విండో విధానంలో వెంట‌నే ప‌రిశీలించి, అనుమ‌తులు మంజూరు చేయాల‌ని చెప్పారు.

              జిల్లా ప‌రిశ్ర‌మ‌లు మ‌రియు ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ (డిఐఈపిసి) స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం జ‌రిగింది. జిల్లాలో కొత్త‌గా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చే వారికి జిల్లా యంత్రాంగం త‌రపున అన్నివిధాలా సంపూర్ణ స‌హ‌కారం అందించి, వీలైనంత వేగంగా స్థాపించే విధంగా కృషి చేయాల‌ని ఆదేశించారు. భూసేక‌ర‌ణ‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. జిల్లాలో కొత్త‌గా ఏర్పాటుకు ప్ర‌తిపాదించిన‌ 8 ప‌రిశ్ర‌మ‌ల గురించి స‌మీక్షిస్తూ, వాటికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందించాల‌ని ఆయా శాఖ‌ల‌కు సూచించారు. సూప‌ర్ స్మెల్ట‌ర్స్ లిమిటెడ్‌, స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్‌, స్టీల్ ఎక్సేంజ్ ఎన్‌ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్‌, అన్సుమి స్పేస్ కార్పొరేష‌న్‌, జెఎస్‌డ‌బ్ల్యూ ఇండ‌స్ట్రీస్ పార్క్ లిమిటెడ్‌, వైశాఖి గ్రోత్ కారిడార్‌, రుషిల్ డెక‌ర్స్‌, ఎలైట్లాజిక్స్ ఎగ్జిమ్ ఏజెన్సీ ఇండియా లిమిటెడ్ త‌దిత‌ర కంపెనీలు జిల్లాలో ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయ‌ని, వీటి ద్వారా సుమారు 54 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని తెలిపారు.  వీటి ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్‌ స‌మీక్షించారు. అలాగే ర్యాంపు కార్య‌క్ర‌మంలో భాగంగా యువ‌త‌కు చైత‌న్యం క‌ల్గించి, ప‌రిశ్ర‌ల‌మ స్థాప‌న‌కు ముందుకు వ‌చ్చేవిధంగా కృషి చేయాల‌ని సూచించారు. దీనికోసం స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించి, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌త్యేకాధికారుల‌కు అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

              ఈ స‌మావేశంలో డిఆర్ఓ ఇ.ముర‌ళి, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ ఇన్‌ఛార్జి జిఎం ఎంవి క‌రుణాక‌ర్‌, పొల్ల్యూష‌న్ ఇంజ‌నీర్ స‌రిత‌, అగ్నిమాప‌క అధికారి రాంప్ర‌కాష్‌, ఏపిఈపిడిసిఎల్ ఎస్ఈ ఎం.ల‌క్ష్మ‌ణ‌రావు, ఎస్‌డిసిలు,  ఇత‌ర శాఖ‌ల అధికారులు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

……………………………………………………………………………………………………

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

27-12-1

27-12-1

27-12-2

27-12-2