జిల్లా KGBVలలో 73 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, అదనపు పధక సమన్వయకర్త ఎ.రామారావు
Publish Date : 06/01/2026
-జిల్లా KGBVలలో 73 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
– అదనపు పధక సమన్వయకర్త ఎ.రామారావు
–
విజయనగరం, జనవరి 05, 2026: విజయనగరం జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) ఖాళీగా ఉన్న 73 బోధనేతర (Non-Teaching) పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయకర్త ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 73 ఖాళీలు దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్ ద్వారా (నేరుగా కార్యాలయంలో సమర్పించాలి) సమర్పించాలన్నారు. దరఖాస్తు స్వీకరణ తేదీలు: 06.01.2026 నుండి 20.01.2026 వరకు, కార్యాలయ పనిదినములలో, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు.
అదనపు పథక సమన్వయకర్త కార్యాలయం, సమగ్ర శిక్షా, విజయనగరం నకు అందజేయాలన్నారు. ఖాళీల వివరాలు: టైపు-III KGBVs: వోకేషనల్ ఇన్స్ట్రక్టర్లు (10), కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు (12), ఏ.ఎన్.ఎం (7), అటెండర్ (4), అసిస్టెంట్ కుక్ (5), డే & నైట్ వాచ్ ఉమెన్ (1), స్కావెంజర్ (7).
టైపు-IV KGBVs: పార్ట్ టైమ్ టీచర్స్ (7), వార్డెన్ (4), కుక్ (11), చౌకీదారులు (5). అర్హతలు & వయోపరిమితి: విద్యార్హతలు: కుక్, స్వీపర్, వాచ్ ఉమెన్, అటెండర్ వంటి పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదు. ఇతర సాంకేతిక పోస్టుల పూర్తి వివరాల కోసం vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చునని తెలిపారు. వయస్సు (01.07.2025 నాటికి):
సాధారణ అభ్యర్థులు: 18 – 45 సంవత్సరాలు, SC/ST/BC/EWS అభ్యర్థులు: 50 సంవత్సరాల వరకు.
మాజీ మహిళా సైనికోద్యోగులు: 45 సంవత్సరాల వరకు ఉండాలన్నారు. ఈ నియామకాలు మండల యూనిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూల ద్వారా జరుగుతాయని, కావున, ఏ మండలంలో ఖాళీలు ఉన్నాయో, ఆ స్థానిక మండలానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ధరఖాస్తుదారులు గమనించాలని కోరారు. మరిన్ని వివరాలకు విజయనగరం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కోరారు.
—————————— —————————— ——————————
జారి: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం