Close

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగవంతం* **జులై లేదా ఆగష్టు లో ప్రారంభానికి అవకాశం* *జూన్ 2026 సిద్ధతకు 98.74% పురోగతి* –రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు జనార్దన్ రెడ్డి

Publish Date : 06/04/2026

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగవంతం*
**జులై లేదా ఆగష్టు లో ప్రారంభానికి అవకాశం*
*జూన్ 2026 సిద్ధతకు 98.74% పురోగతి*
–రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు జనార్దన్ రెడ్డి.
 విజయనగరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ఏదో ఒక రోజున ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి అపాయింట్మెంట్, ఆ రోజులలో మంచి రోజు చూసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసారు.
ఆదివారం మంత్రివర్యులు ఎం ఎస్ ఎం ఇ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలసి భోగాపురం లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రాయం పనులను పరిశీలించిన అనంతరం పాత్రికేయ సమావేశం లో మంత్రి మాట్లాడారు.
2014లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటికీ, గత ప్రభుత్వ కాలంలో పనులు మందగించాయని విమర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించి సమస్యలను పరిష్కరించడంతో పనులు వేగవంతమయ్యాయని చెప్పారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకే దక్కుతుందని స్పష్టం చేసారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు సుమారు 97 శాతం పూర్తయ్యాయని
ఎర్త్ రన్‌వే పనులు 100% పూర్తయ్యాయని,
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) 95% పూర్తయ్యాయని మంత్రి వివరించారు.
ఈ విమానాశ్రయం 6 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా GMR సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి పనులు కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన కనెక్టివిటీ రోడ్లను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మరో 6 కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం చేపడుతున్నామని, శ్రీకాకుళం, నెల్లూరు, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, విశాఖపట్నం ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించనుందన్నారు.
జూన్ 2026 నాటికి  98.71 లక్ష్యంగా ప్రణాళిక చేసినప్పటికీ ఇప్పటికే 98.74% పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు.
 ప్రాజెక్ట్‌లో ప్రధాన భాగాల పురోగతిని వివరిస్తూ,  ఎర్త్ వర్క్స్, రన్‌వే, టాక్సీవే పనులు 100% పూర్తి, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ (PTB) – 98.76%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) – 95.75%, అనుబంధ భవనాలు – 93.54%, మెయిన్ యాక్సెస్ రోడ్ – 90% పూర్తయ్యాయని వివరించారు. అదేవిధంగా, ఆరు మిలియన్ ప్రయాణికులు
చెక్-ఇన్ కౌంటర్లు 40, డిజి యాత్ర పాడ్స్ 12, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు 26, రన్‌వే 3,800 మీటర్లు, ఏప్రాన్ 18 విమానాల నిలుపుదల సామర్థ్యం ఏర్పాటు చేశామన్నారు.
ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ పనులు కొనసాగుతున్నాయన్నారు.
విశాఖపట్నం నుండి 7 ప్రాధాన్య రహదారుల అభివృద్ధి పనులు ప్రగతిలో ఉండగా,
ఆనందపురం జంక్షన్ వద్ద ఎలివేటెడ్ రోడ్ DPR తయారీ జరుగుతోందని తెలిపారు.
బీచ్ రోడ్ కారిడార్ అలైన్‌మెంట్ ఫైనలైజేషన్ పూర్తయిందన్నారు.
ఏరోడ్రోమ్ లైసెన్స్, BCAS భద్రతా అనుమతులు ప్రాసెస్‌లో ఉన్నాయని,
కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ నోటిఫికేషన్లు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
*భోగాపురం విమానాశ్రయం – కనెక్టివిటీ అభివృద్ధి*
–ఎంఎస్ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిపై  అధికారులతో సమీక్ష నిర్వహించానని,
విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు. విశాఖపట్నం నగరం నుండి విమానాశ్రయానికి సులభ రాకపోకల కోసం చేపడుతున్న రోడ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించామన్నారు.
విమానాశ్రయం ప్రారంభానికి అవసరమైన మౌలిక వసతులు మరియు కనెక్టివిటీ పనులను సమయానికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అదనంగా, కేంద్ర సంస్థల అనుమతులు మరియు ఇతర అవసరమైన క్లియరెన్సులు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారమని అన్నారు.  ముఖ్యమంత్రి దూరపు చూపుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి తో పాటు స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు.  నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి, విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతి రాజు మరిన్ని వివరాలు తెలిపారు.
ఈ పాత్రికేయ సమావేశం లో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ ఆధారిటీ ఎండి ప్రవీణ్ ఆదిత్య, మార్కుఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు, ఎయిర్పోర్ట్ సి ఇ ఒ అన్వర్ బీర్ సింగ్ కార్య తదితర అధికారులు పాల్గొన్నారు.
=======
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం.
060426

060426

060426-1

060426-1