Close

Accelerate Home Rights Scheme District Collector A. Suryakumari

Publish Date : 17/11/2021

గృహ‌హ‌క్కు ప‌థ‌కాన్ని వేగ‌వంతం చేయండి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

విజ‌య‌న‌గ‌రంన‌వంబ‌రు 16 ః
జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కం అమ‌లును వేగ‌వంతం చేయాల‌నిఅధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప‌థ‌కంపై త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. జిల్లాలోని మండ‌లాలుమున్సిపాల్టీల వారీగా ఈ ప‌థ‌కం ప్ర‌గ‌తిని తెలుసుకున్నారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూఒన్‌టైమ్ సెటిల్మెంట్ ప‌థ‌కానికి ల‌బ్దిదారుల‌నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు 148 మంది స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చిసుమారు రూ.16 ల‌క్ష‌లను చెల్లించార‌ని చెప్పారు. గృహ ల‌బ్దిదారుల‌కు ఈ ప‌థ‌కం వ‌రం లాంటిద‌నిరుణాన్నివ‌డ్డీని కూడా ఒకే విడ‌త‌లో చెల్లించిఆ ఇంటిపై సంపూర్ణ హ‌క్కును పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. రుణం నుంచి విముక్తి పొంద‌డ‌మే కాకుండాఆ ఇంటిపై శాశ్వ‌తంగా హ‌క్కును పొందే సువ‌ర్ణావ‌కాశాన్ని ఈ పథ‌కం క‌ల్పిస్తోంద‌ని చెప్పారు. అతిత‌క్కువ మొత్తంతోనే అన్నిహ‌క్కులు ల‌భిస్తాయ‌ని అన్నారు. ఓటిఎస్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించిదీనిని స‌ద్వినియోగం చేసుకొనేలా చూడాల‌ని అన్నారు. స‌చివాల‌య సిబ్బందివ‌లంటీర్లు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిల‌బ్దిదారుల‌కు ఈ ప‌థ‌కం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించాల‌ని సూచించారు. ఇప్ప‌టివ‌ర‌కు 50శాతం డేటాను మాత్ర‌మే ఆన్‌లైన్ చేయ‌డం జ‌రిగింద‌నిమిగిలిన దానిని కూడా వెంట‌నే పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్‌జాయింట్ క‌లెక్ట‌ర్‌ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్‌ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌,  మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌హౌసింగ్ పిడి ఎస్‌.కూర్మినాయుడుఇఇ ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తివిజ‌య‌న‌గ‌రం తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌ర్‌ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Accelerate Home Rights Scheme District Collector A. Suryakumari