Close

All facilities in R&R Colony Joint Collector Dr. GC Kishore Kumar laid the foundation stone for the construction of houses in the colony.

Publish Date : 18/10/2021

ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు
జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌
కాల‌నీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న‌

భోగాపురం (విజ‌య‌న‌గ‌రం)అక్టోబ‌రు 14 ః  
నిర్వాసితుల‌కోసం నిర్మించ‌నున్న కాల‌నీల్లో అన్ని మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌య నిర్వాసితుల‌కోసంగూడెపువ‌ల‌స వ‌ద్ద ప్ర‌తిపాదించిన ఆర్అండ్ఆర్ కాల‌నీలో ఇళ్ల‌ నిర్మాణానికి  శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం మొద‌ల‌య్యింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగాబొల్లింక‌ల‌పాలెం గ్రామానికి చెందిన ఇళ్లు కోల్పోయిన 55 మంది నిర్వాసితులుగురువారం ఇక్క‌డ భూమిపూజ చేశారు.  నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికిఒక్కొక్క‌రికీ 5 సెంట్లు చొప్పున స్థ‌లాన్ని కేటాయించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూనిర్వాసితులకు ఇంటి నిర్మాణానికిఆర్అండ్ఆర్ కాల‌నీల్లో స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. లబ్ధిదారుల స్వయంగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఒక్కొక్క ఇంటికి రూ. 9 లక్షల 20 వేలనుఆర్ఆర్ ప్యాకేజీ కింద  కేటాయించడం జరుగుతుందని చెప్పారు. కాల‌నీలో రోడ్లుకాలువలువిద్యుత్త్రాగునీరు త‌దిత‌ర అన్నిర‌కాల మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డం జరుగుతుంద‌ని జెసి చెప్పారు.

ఆర్డిఓ బిహెచ్‌. భవాని శంకర్ మాట్లాడుతూలబ్ధిదారులకు నిధులనునేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.  లబ్ధిదారులు దళారులను నమ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నానేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంత‌రం పోలిప‌ల్లి ఆర్అండ్ఆర్ లేఅవుట్ ప‌నుల‌ను ప‌రిశీలించారు.      

ఈ కార్య‌క్ర‌మంలో తాశీల్దార్‌ రమణమ్మవైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డిగూడెపు వలస సర్పంచ్ అయ్యప్ప రామకృష్ణా రెడ్డిఎయిర్ పోర్ట్ అథారిటీ   భూసేక‌ర‌ణ స‌మ‌న్వ‌యాధికారి జి.అప్పలనాయుడుఇత‌ర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.

All facilities in R&R Colony Joint Collector Dr. GC Kishore Kumar laid the foundation stone for the construction of houses in the colony.