All members should be aware of the SC, ST Attacks Act District Collector A. Surya Kumari
Publish Date : 11/10/2021
దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తో మహిళా బాధితల సంఖ్య తగ్గుతుంది
ఎస్.సి, ఎస్.టి దాడుల చట్టం పై సభ్యులందరికి అవగాహన ఉండాలి
జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి
విజయనగరం, అక్టోబర్ 08:: స్త్రీ, పురుష బేధం లేకుండా ప్రతి ఒక్కరూ దిశా యాప్ డౌన్లోడ్ చేసు కోవడం ద్వారా మహిళల పై దాడులు సంఖ్యను తగ్గించ వచ్చని జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి దాడుల నిరోధ చట్టం జాతీయ స్థాయి లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో దిశా యాప్ ఉందని అన్నారు.
కలెక్టరేట్ ఆడిటోరియం లో శుక్రవారం ఎస్.సి, ఎస్.టి దాడుల నిరోధ చట్టం పై జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఎస్.సి, ఎస్.టి ల పై జరిగిన దాడులకు సంబంధించిన కేస్ లను సమీక్షిస్తూ మహిళల పై దాడులు జరిగేటప్పుడు వెంటనే నిరోధించడానికి దిశా యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల పూస పాటిరేగ మండలం చౌడువాడ లో ఒక అమ్మాయి పై జరిగిన దాడిని దిశా ద్వారానే వెంటనే ఆపగలిగామని ఉదహరించారు. ఈ కేస్ పట్ల పోలీస్ , ఇతర అధికారులు వెంటనే స్పందించి బాధితురాలును రక్షించినందుకు మొత్తం బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి దీపికా పాటిల్ చౌడువాడ బాధితురాల పట్ల ఏ విధంగా వ్యవరించింది, రక్షించింది వివరించారు. దిశా యాప్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని కలెక్టర్ పోలీస్ అధికార్లకు సూచించారు.
ఎజెండా వివరాలను వెల్లడిస్తూ ఈ త్రై మాసికం లో ఎస్.సి, ఎస్.టి ల పై 39 కేస్ లు నమో దైనాయని, అందులో 9 కేస్ లు రెఫర్ అయ్యాయని, 30 కేస్ కు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయని సోషల్ వెల్ఫేర్ డి డి తెలిపారు. గతం లో నమోదైన 54 కేస్ లకు గాను 81.85 లక్షల పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. కలెక్టర్ స్పందిస్తూ కేస్ ల సత్వర పరిష్కారానికి కావలసిన కుల ధ్రువ పత్రాలు, లీగల్ ఒపినిఒన్స్ ను త్వరగా ఇవ్వాలని డి.ఆర్.ఓ కు, ఎపిపి సూచించారు.
ఈ చట్టం పై సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, చట్టం లో ఏ ఏ అంశాలు ఉంటాయో తెలిస్తే సభ్యులు స్పష్టముగా ప్రశ్నిస్తారని అన్నారు. ప్రతి నెల 30 న అన్ని మండలాల్లో పౌర హక్కుల పై సమావేశం నిర్వహించాలని, మండల స్థాయి మినిట్స్ తో జిల్లా స్థాయి సమావేశానికి హాజరవ్వాలని అన్నారు. ఆ మేరకు తఃసిల్దార్లకు సర్కులర్ ఇవ్వాలని డి.ఆర్.ఓ కు సూచించారు.
ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ ఆసరా జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు. జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.